అందరూ గుర్తుపెట్టుకునే పాత్రల్లోనే నటిస్తా ( హీరోయిన్ అంజలి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మొదట బాలకృష్ణగారితో సినిమా అనగానే చాలా టెన్షన్ పడ్డాను. అంత పెద్ద స్టార్ హీరోతో పనిచేయడం అంటేనే చాలా టెన్షన్‌తో కూడుకున్న పని. కానీ, ఆయనతో పనిచేసినప్పుడు మాత్రం చాలా సపోర్టు అందించారు’ అని అంటోంది హీరోయిన్ అంజలి. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’, ‘గీతాంజలి’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రల్లో నటించి ఆకట్టుకుంది. తెలుగు హీరోయిన్ అయిన అంజలి అటు తమిళంలో కూడా బిజీగా వుంది.
తాజాగా ఆమె నటించిన చిత్రం ‘డిక్టేటర్’. బాలకృష్ణ, అంజలి, సోనాల్ చౌహాన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి శ్రీవాస్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఈనెల 14న విడుదలవుతున్న సందర్భంగా హీరోయిన్ అంజలితో ముఖాముఖి..
ఇందులో మీ పాత్ర గురించి?
రెగ్యులర్ కమర్షియల్ సినిమాలో వుండే హీరోయిన్‌గా కాకుండా ఈ చిత్రంలో కొత్తగా కన్పిస్తాను. నేనిప్పటివరకూ చేసిన సినిమాలకంటే స్టైల్ పరంగా కానీ, లుక్ పరంగా కానీ కొత్తగా వుంటుంది. ఇందులో ఆఫీసుకువెళ్ళే అమ్మాయిగా కన్పిస్తాను.
బాలకృష్ణతో పనిచేయడం?
నిజంగా బాలకృష్ణగారితో సినిమా అనగానే చాలా టెన్షన్ పడ్డాను. ఆయనతో సమానంగా నటించగలనా అనే భయముండేది. కానీ సెట్‌లోకి వెళ్లిన తరువాత ఆయన అందరితో చాలా ఫ్రీగా వుంటారు. ముఖ్యంగా తన తోటి నటీనటులకు మంచి ప్రాధాన్యత ఇస్తారు.
బాలకృష్ణ చాలా స్పీడ్‌గా వుంటారు కదా!
ఔనండీ, ఆయన చాలా స్పీడు. ఈ సినిమా ప్రారంభంలో మొదటిరోజే పాట షూటింగ్‌లో జాయిన్ అయ్యాను. మొదట్లో కాస్త టెన్షన్ పడ్డా, తరువాత ఓకె అయ్యింది. ఆయనతో పనిచేయడం ద్వారా క్రమశిక్షణ, డెడికేషన్ అంటే ఏమిటో తెలుసుకున్నాను.
గతంలో ఆయనతో సినిమాలు
మిస్ చేసుకున్నారు?
ఔను. బాలయ్యగారి ‘లెజెండ్’, ‘లయన్’ చిత్రాల్లో నేనే నటించాల్సి వుంది. కానీ అప్పుడు వేరే సినిమాలతో బిజీగా వుండడంవలన కుదరలేదు. ఈ సినిమాతో ఆ ఛాన్స్ దక్కింది.
ఈమధ్య స్పీడ్ పెంచారు, కారణం?
స్పీడ్ పెంచడం కాదు. సినిమా అవకాశాలు అలా వస్తున్నాయి. దానికితోడు రోజూ షూటింగ్‌కి వెళ్లడం నాకు ఇష్టం.
తెలుగమ్మాయిలు ఇక్కడ రాణించలేరనే
భావం వుంది కదా?
తెలుగు పరిశ్రమలో తెలుగు హీరోయిన్లు నిలబడరని అంటుంటారు, దానికి కొన్ని పరిధులు వుండడం, దానికితోడు మంచి ప్లాట్‌ఫాం క్రియేట్ చేసుకోకపోవడంవల్ల అవకాశాలు తగ్గుతాయి. అంతేకానీ, తెలుగమ్మాయిలు నిలబడలేకపోతున్నారని అనలేం. ఇక్కడ అందర్నీ ప్రోత్సహిస్తారు. ఇక నావరకంటారా, ఒకేసారి వచ్చిన అవకాశాలన్నీ చేయకుండా సెలెక్టివ్‌గా నా పాత్రకు ప్రాముఖ్యతను బట్టి సినిమాలు చేస్తా.
సినిమా ఎంపిక విషయంలో మీ మొదటి
ప్రాధాన్యత?
నేను ముందు కథకే ప్రాధాన్యతనిస్తా. దానికితోడు నా పాత్ర ఎలా వుంటుందనే దానిపై కూడా దృష్టిపెడతా. నేను నటించిన ‘సీతమ్మ వాకిట్లో...’ సినిమా వచ్చి నాలుగేళ్లయినా కూడా ఇప్పటికీ ఆ పాత్రను గుర్తుపెట్టుకున్నారు.
తమిళంలో కూడా బిజీగా వున్నారా?
తెలుగుమ్మాయిలు తమిళంలో బాగా రాణిస్తారని అంటారు. ఏ భాషైనా సినిమా హిట్ అవ్వడమే ముఖ్యం. అక్కడ అలాంటి మంచి అవకాశాలు రావడం కూడా ఓ కారణమే.
దర్శకుడు శ్రీవాస్ గురించి?
ఈ సినిమాకు శ్రీవాస్ దర్శకుడిగానే కాకుండా ప్రొడ్యూసర్ కూడా. రెండు పనులూ చేయగల సమర్థుడాయన. ప్రతి విషయంలో పర్‌ఫెక్ట్‌గా వుంటారు. ప్రేక్షకులకు ఏం కావాలో ఆయనకు బాగా తెలుసు.
జయాపజయాల గురించి ఎలా రెస్పాండ్
అవుతారు?
హిట్ వస్తే ఎవరికైనా ఆనందమే కదా. ప్లాఫ్ వస్తే బాధపడతాను. ఏదైనా మంచి సినిమా చేశామన్న తృప్తి కలగాలి. ఇటీవలే నేను ‘శంకరాభరణం’ సినిమాలో చేసిన పాత్ర బాగుందని చేశా.
గాసిప్స్ గురించి?
నేను చాలా సెన్సిటివ్. మొదట్లో గాసిప్స్ గురించి విని చాలా ఫీలయ్యేదాన్ని. ప్రస్తుతం అలాంటి వార్తలొస్తే స్నేహితులు, శ్రేయోభిలాషులతో పంచుకుని ఎంజాయ్ చేస్తాను. నిజ జీవితంలో నాది హైపర్ కారెక్టర్. సైలెంట్‌గా వుండడం ఇష్టం వుండదు.
తమిళంలో కూడా మీరే డబ్బింగ్ చెబుతారా?
ఔను. తెలుగు, తమిళ భాషల్లో నా డబ్బింగ్ నేనే చెబుతాను.
ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులు
అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న చిత్రంలో స్పెషల్ సాంగ్ చేస్తున్నాను. ఇది ఐటెం సాంగ్ మాత్రం కాదు. బన్నీతో సమానంగా వుండేలా నా పాత్ర వుంటుంది.
చిత్రాంగద ఎప్పుడు?
ఆ సినిమా మొత్తం షూటింగ్ పూర్తయింది. నిజానికి డిసెంబర్‌లోనే విడుదల చేయాలనుకున్నాం. కానీ కుదరలేదు. ఫిబ్రవరిలో వుంటుంది.
తదుపరి చిత్రాలు
తెలుగులో రెండు కథలు విన్నాను. అవి చర్చల దశలో వున్నాయి. వాటితోపాటు మమ్ముట్టి సరసన తమిళంలో రూపొందే ఓ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. దాంతోపాటు మరో తమిళ సినిమా విడుదలకు సిద్ధంగా వుంది. తమిళంలో రెండు చిత్రాలు, మలయాళంలో ఒక చిత్రంలో నటిస్తున్నాను.

-శ్రీ