గొప్పల దీపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇర్ఫాన్‌ఖాన్, టబు వంటివారికి ఎన్నో హాలీవుడ్ ఆఫర్లు వచ్చాయి. త్వరలో ప్రియాంకా చోప్రా నటించిన బేవాచ్ సినిమాకి భారీ పబ్లిసిటీ చేస్తున్నారు. ఈమధ్యనే ట్రిపుల్ ఎక్స్ సినిమాలో టాప్ హీరో విన్ డీజిల్ పక్కన దీపికా పదుకొనె నటించింది. ఆ సినిమా ప్రమోషన్ కోసం విన్ డీజిల్ ఇండియాకి రావడం, దీపికాని ఆకాశానికి ఎత్తి పొగిడేయడం చూశాం. మొత్తానికి ఆ ఒక్క సినిమాతో దీపికా ఎంతో ఖుషీగా ఉంది. ఈ సందర్భంలోనే మరో హీరోయిన్ కంగనా రనౌత్ స్పందన వేరేలా ఉంది. ‘హాలీవుడ్‌కి నువ్వు ఎప్పుడు వెళతావ్?’ అని అడగ్గానే కుండబద్దలు కొట్టినట్లు స్పందించింది కంగనా. హాలీవుడ్ కంటే మన సినిమాలే చాలా బాగుంటున్నాయని ఆమె అంటోంది. ‘జంగిల్‌బుక్’ మనదేశంలో భారీ కలెక్షన్లు రాబట్టిందనీ ఆ స్థాయిలోనే మన చిత్రాలకు థియేటర్లు లభిస్తే అంతకంటే ఎక్కువ లాభాలే తీసుకొస్తాయని అంది.