మరో ఛాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు, తమిళ భాషల్లో చాలా చిత్రాలు చేసినప్పటికీ కెరీర్ పరంగా
సరైన సక్సెస్‌ని అందుకోలేకపోయింది గ్లామర్ భామ తాప్సి. అవకాశాలైతే జోరుగా అందుకుంటున్న ఈ భామకు తాజాగా మరో క్రేజీ అవకాశం దక్కింది. ఇప్పటికే బాలీవుడ్‌లో రెండు మూడు చిత్రాల్లో నటించిన తాప్సి తాజాగా
తమిళంలో సూపర్‌హిట్ అయిన ‘కత్తి’ చిత్రానికి రీమేక్‌గా రూపొందే చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది. అక్షయ్ కుమార్ హీరోగా రూపొందే ఈ చిత్రానికి మురుగదాస్ దర్శకత్వం వహిస్తాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా
జరుగుతున్నాయి. మరోవైపు ‘కత్తి’ చిత్రాన్ని తెలుగులో కూడా రూపొందించేందుకు సన్నాహాలు చివరి దశలో వున్నాయి. చిరంజీవి హీరోగా రూపొందే ఈ సినిమాలో హీరోయిన్‌గా నయనతార ఓకె అయిందట. వి.వి.వినాయక్ దర్శకత్వం వహించే ఈ చిత్రం వచ్చేవారంలో ప్రారంభం కానుంది. మొత్తానికి కత్తి చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందనుంది. తెలుగులో నయనతార కత్తి పట్టగా, హిందీలో తాప్సి నటిస్తోంది. మరి ఈ సినిమా అయిన ఈ భామకు
కమర్షియల్ విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.