మలయాళ దర్శకుడితో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో మల్టీస్టారర్ చిత్రాలకు తెరలేపిన వెంకటేష్, ప్రస్తుతం సోలో హీరోగా వరుస సినిమాల్లో నటించడానికి రెడీ అయ్యాడు. ఇప్పటికే ఆయన మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘బాబు బంగారం’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాతోపాటు ఆయన మరో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. ప్రముఖ మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శకత్వంలో సినిమా చేస్తాడని అంటున్నారు. ఇప్పటికే కథా చర్చలు జరుపుకున్న ఈ చిత్రం స్క్రిప్ట్‌వర్క్ జరుగుతోంది. జీతూ జోసెఫ్ రూపొందించిన ‘దృశ్యం’ చిత్రం పలు భాషల్లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ‘దృశ్యం’ సినిమా తెలుగు రీమేక్‌లో వెంకటేష్ నటించాడు. ఇపుడు వీరిద్దరి కలయికలో రూపొందే సినిమా ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది.