ఉంగరాల రాంబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సునీల్ కథానాయకుడిగా యునైటెడ్ కిరీటి మూవీస్ పతాకంపై క్రాంతిమాధవ్ దర్శకత్వంలో పరుచూరి కిరీటి రూపొందిస్తున్న చిత్రానికి ‘ఉంగరాల రాంబాబు’ అనే పేరును ఖరారు చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, రథసప్తమి సందర్భంగా ప్రచార రథాన్ని శుక్రవారం సునీల్ ప్రారంభించారని, అన్ని కమర్షియల్ హంగులతో రూపొందిస్తున్న ఈ చిత్రం వైవిధ్యభరితంగా ఉంటుందన్నారు. పూర్తిస్థాయి కామెడీ, కమర్షియల్ చిత్రంగా రూపొందుతుందని అన్నారు. 90 శాతం షూటింగ్ పూర్తిచేశామని, త్వరలోనే ఆడియో విడుదల జరిపి వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తామని ఆయన అన్నారు. మియాజార్జ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, పోసాని కృష్ణమురళి, ఆశీష్ విద్యార్థి, అలీ, వెనె్నల కిశోర్, రాజీవ్ కనకాల, రాజా రవీణద్ర, మధునందన్, ప్రభాస్ శ్రీను, తా.రమేష్, దువ్వాసి, సత్తెన్న, చిత్రం శ్రీను, సత్యం రాజేష్, వౌళిక తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. సంగీతం:జీబ్రాన్, పాటలు:రామజోగయ్య శాస్ర్తీ, రెహమాన్, కెమెరా:సర్వేష్ మురారి, శ్యామ్ కె నాయుడు, ఎడిటింగ్:కోటగిరి వెంకటేశ్వరరావు, మాటలు:చంద్రమోహన్ చింతాడ, నిర్మాత:పరుచూరి కిరీటి, దర్శకత్వం:కె.క్రాంతిమాధవ్.