షో టైమ్ పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రణధీర్, రుక్సర్ మీర్ జంటగా ఎస్.ఎస్.కాంచి దర్శకత్వంలో రమా రీల్స్ పతాకంపై జాన్ సుధీర్ పూదోట నిర్మిస్తున్న ‘షో టైమ్’ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ప్రముఖ హీరోయిన్ అనుష్క సీడీని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో శివశక్తి దత్తా, రాజవౌళి, విజయేంద్రప్రసాద్, రాఘవేంద్రరావు, కీరవాణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజవౌళి మాట్లాడుతూ- ‘ట్రైలర్ బాగుంది. ఇది మంచి సినిమాగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. కీరవాణి మంచి మ్యూజిక్ ఇచ్చారు’ అన్నారు. అనుష్క మాట్లాడుతూ- ‘రాజవౌళి ఫ్యామిలీ ఎప్పుడూ నన్ను ఏదో కొత్త విషయంతో సర్‌ప్రైజ్ చేస్తుంటారు. అందరూ మంచి టాలెంటెడ్. ఈ చిత్రంలోని పాటలన్నీ బాగున్నాయి. తప్పకుండా మంచి విజయం సాధించాల’న్నారు. దర్శకుడు కాంచి మాట్లాడుతూ- ‘మంచి సినిమా తీయగలనన్న నమ్మకంతో చేసిన సినిమా ఇది. నటీనటులందరూ చక్కగా నటించారు. సినిమాలో తప్పులేమైనా ఉంటే సరిదిద్దుకుంటాను’ అన్నారు.