ఎన్టీఆర్ హిరణ్యకశప?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారీ చిత్రాల రూపశిల్పిగా గుర్తింపు తెచ్చుకున్న గుణశేఖర్ అత్యంత భారీ బడ్జెట్‌తో రుద్రమదేవి చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత పలు ప్రాజెక్టులను సెట్స్‌పైకి తేవడానికి సన్నాహాలు చేస్తున్న ఆయన తాజాగా హిరణ్యకశప పేరుతో భారీ చిత్రాన్ని తెరకెక్కించేందుకు కసరత్తులు మొదలుపెట్టాడు. తల్లి గర్భంలో వుండగానే విష్ణ్భుక్తిని జీర్ణించుకుని పరమ భక్తునిగా పేరుగాంచిన భక్తప్రహ్లాదుడి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం ఉంటుందని తెలిసింది. ఈ చిత్రంలో హీరోగా ఎన్టీఆర్ నటించే అవకాశాలున్నట్టు గుణశేఖర్ ఓ సందర్భంగా తెలిపారు. ఇప్పటికే ఎన్టీఆర్‌తో చర్చలు కూడా జరిపినట్టు సమాచారం. రుద్రమదేవి చిత్రానికి సీక్వెల్‌గా ప్రతాపరుద్రుడు పేరుతో మరో చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ రెండు కథలు సిద్ధమయ్యాయని, మొదట హిరణ్యకశప చిత్రాన్ని తెరకెక్కిస్తానని తెలిపాడు. మరి హిరణ్యకశప చిత్రంలో ఎన్టీఆర్ నటిస్తే నిజంగా అది సంచలనమే అని చెప్పాలి. ప్రస్తుతం ఎన్టీఆర్ బాబి దర్శకత్వంలో తన 27వ చిత్రంలో నటిస్తున్నాడు.