ఈరోజుల్లో సీతారాముల్లా ఎవరుంటారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈతరం అమ్మాయిలు, అబ్బాయిలు ఎలా ఉంటున్నారనే అంశంతో వారి లైఫ్ స్టైల్‌ని తెరపై ఆవిష్కరిస్తూ సహజత్వానికి దగ్గరగా ఉండేలా వెంకటేష్.కె ‘ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారండి బాబు’ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. యూత్‌ఫుల్ రొమాంటిక్ స్పైసీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రశాంత్, మహీధర్, లలిత, ఇషితా హీరో హీరోయిన్లుగా నటించారు. ప్రశ్నార్ద్ తాతా నిర్మించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదల సన్నాహాల్లో వుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడుతో ఇంటర్వ్యూ..
టైటిల్‌కి రీజన్?
కథానుసారంగా ఈ టైటిల్ పెట్టాను. సినిమా చూస్తే ఈ సినిమాకు టైటిల్ పర్‌ఫెక్ట్ యాప్ట్ అని మీరే అంటారు. ఇద్దరు కాలేజీ స్టూడెంట్స్ లగ్జరీ లైఫ్‌కు అలవాటుపడి చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటారు. కొంతమంది అమ్మాయిలు, ఆంటీల వీక్‌నెస్ పట్టుకొని వారికి మాయమాటలు చెప్పి వలలో వేసుకుంటారు. వారితో రొమాన్స్ చేయడమే కాకుండా వారి దగ్గర డబ్బు, నగలు దోచుకుంటుంటారు. ఈ క్రమంలో వీళ్ళల్లో ఒక్కొక్క లేడీ వరుసగా హత్య చేయబడుతుంటారు. అసలు ఈ హత్య ఎవరు ఎందుకు చేస్తున్నారన్నది చిత్ర కథాంశం. ఇంటర్‌వెల్ సీన్, క్లైమాక్స్ సీన్ ఇంతవరకు తెరపై చూడని విధంగా ఉంటుంది. అందుకే దీన్ని రొమాంటిక్ క్రైమ్ స్పైసీ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దాం.
రియల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయా?
కథ కల్పితమే. కాకుంటే సీన్స్ కాని, పాత్ర స్వభావం కాని నిత్యం మనం చూస్తున్నవే ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే రోడ్డుమీద కుర్రాళ్లు ఎలా మాట్లాడుకుంటారో.. ఎలా బిహేవ్ చేస్తుంటారో- అలాగే సినిమా అంతా నేచురల్‌గా ఉంటుంది. నేను ఏదైనా నేచురల్‌గా ఉండటానికే ఇష్టపడతాను. ఇకమీద కూడా ఇలాంటి సహజ సిద్ధమైన కథతో సినిమాలు చేస్తాను. మనం మెసేజ్‌లు ఇస్తే తీసుకునే పొజిషన్‌లో ఇక్కడ ఎవరూ లేరన్నది నా అభిప్రాయం. కాబట్టి ఎలాంటి మెసేజ్‌లు మా సినిమాలో లేవు. రొమాన్స్‌కు అలవాటుపడిన అమ్మాయిలు, అబ్బాయిలు చివరకు ఎలా క్రైమ్‌లో ఇరుక్కుంటున్నారు అన్నది చూపించాను. ఇందులో ప్రేమ ఉంది. దాని తాలూకు పెయిన్ వుంది. ఆల్ కమర్షియల్ యాంగిల్స్ ఉన్నాయి.
ఇలాంటి బోల్డ్ సబ్జెక్ట్స్‌కి రీజన్?
ఇలాంటి నేచురల్ సబ్జెక్ట్స్ చేయడం అంటే ఇష్టం. అందుకే చేశాను. ఇకమీదట కూడా చేస్తాను. నాకు తెలిసి రొమాన్స్‌లో అన్ని భావోద్వేగాలు ఉంటాయి. ఇందులో కూడా లవ్ ఉంది, క్రైమ్ ఉంది, ఎమోషన్ ఉంది, యాక్షన్ ఉంది, కామెడీ ఉంది. ఎవరు చేసినా వీటిని బేస్ చేసుకుని సినిమా చేయాల్సిందే. గన్ పట్టినవాడైనా, ఫ్యాక్షనిస్టు అయినా ఫైనల్‌గా రొమాన్స్ చేస్తాడు కాబట్టి.. రొమాంటిక్ సబ్జెక్ట్ ఎంచుకున్నా. నాకు ఈ సినిమా ఎలాంటి పేరు తెస్తుందో చెప్పలేను కాని ప్రెజెంట్ నడుస్తున్న ట్రెండ్ ఎలా ఉందో కళ్లకు కట్టినట్లు చూపించాడీ దర్శకుడు అని చూసిన ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ఈ చిత్రంలో పతాక స్థాయిలో రొమాన్స్ ఉన్న కారణంగా ‘ఎ’ సర్ట్ఫికెట్ ఇచ్చారు. చిన్న చిన్న కట్స్, మ్యూట్స్ చెప్పారు. సినిమా ఏదో బోల్డ్‌గా తీయాలని లేదు. కథానుసారంగా అలా తీయాల్సి వచ్చింది కాబట్టి తీశాను. యూత్‌ని బాగా ఆకర్షించే చిత్రం.
తదుపరి చిత్రం?
ఈ సినిమాను మార్చిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. నా కొత్త సినిమా కూడా మార్చిలోనే ప్రారంభిస్తాను. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తా.

-యు