గ్లామర్ పాత్రల్లో నటించాలనుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పనిపట్ల కమిట్‌మెంట్‌తో ఉంటాను. నా సంతోషం నాకు ముఖ్యం. నచ్చిన పనిని చేసుకుంటూ వెళ్లడమే నాకు తెలుసు’ అంటోంది అందాల భామ సురభి. ‘బీరువా’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. ‘రఘువరన్ బి.టెక్’ చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఎక్స్‌ప్రెస్ రాజా’. శర్వానంద్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది సురభి. మేర్లపాక గాంధి దర్శకత్వంలో యు.వి. క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 14న విడుదలవుతున్న సందర్భంగా హీరోయిన్ సురభితో ముఖాముఖి...
* సినిమాలో మీ పాత్ర?
- నా పాత్ర పేరు అమూల్య. పాజిటివ్‌గా ఆలోచించే అమ్మాయిని. పెంపుడు జంతువులంటే ఇష్టం. ఈ పాత్రలో చాలా వేరియేషన్స్ వున్నాయి. ముఖ్యంగా నటనకు మంచి స్కోప్ వున్న పాత్ర. నేను చేసిన చిత్రాల్లోకెల్లా బెస్ట్‌రోల్ అని చెప్పవచ్చు.
* ఇందులో యాక్షన్ సీన్స్ చేశారట, నిజమేనా?
- ఔను. ఈ సినిమాలో నాకు ఇంట్రడక్షన్ ఫైట్ సన్నివేశం వుంటుంది. ఫైట్ మాస్టర్ జాషువా తన టీమ్‌తో కలిసి ట్రైనింగ్ ఇచ్చారు. కొంతమంది అబ్బాయిలు టీజ్ చేస్తుంటే, ఆ అమ్మాయి వాళ్ళని ఎలా ఎదుర్కొందీ అనేది ఆ సన్నివేశంలో వుంటుంది.
* శర్వానంద్‌తో పనిచేయడం?
- శర్వానంద్ చాలా మంచి నటుడు. ఈ సినిమా చేయకముందే ఆయన చేసిన సినిమాలు ‘రన్ రాజా రన్’, ‘మళ్లీ మళ్లీ ఇదిరానిరోజు’ సినిమాలు చూశాను. భిన్నమైన సినిమాల్లో నటిస్తున్నాడు. మంచి ఫ్రెండ్లీ నేచర్ వున్న వ్యక్తి.
* ఈ సినిమాలో అవకాశం ఎలా వచ్చింది?
- నేను తెలుగులో ‘బీరువా’ సినిమాతో పరిచయమయ్యాను. ఆ తరువాత వర్మగారి ‘అటాక్’ చిత్రంలో నటించాను. ఆ సినిమా సమయంలో దర్శకుడు గాంధి ఈ సినిమా చేద్దామని చెప్పారు.
* దర్శకుడు గాంధీతో పనిచేయడం?
- గాంధి చాలా కూల్‌గా వుంటాడు. నటీనటులనుండి మంచి నటనను రాబట్టుకోవడం ఆయనకు బాగా తెలుసు. మళ్లీ తనతో సినిమా చేయాలనుంది.
* ఎలాంటి పాత్రల్లో నటించాలనుంది?
- నేను ఇప్పటివరకూ చేసిన సినిమాల్లో అన్నీ హోలీ పాత్రల్లోనే నటించాను. నటి అన్నపుడు అన్నిరకాల పాత్రల్లో మెప్పించాలి. నాకు గ్లామర్ పాత్రల్లో నటించాలని వుంది.
* ఈ సినిమాతో మీ కెరీర్‌కు ఎలాంటి
ఇమేజ్ వస్తుందనుకుంటున్నారు?
- ఈ సినిమాపై భారీగానే అంచనాలున్నాయి. అందరం ఎఫర్ట్‌పెట్టి పనిచేశాం. ఖచ్చితంగా ఈ సినిమా నా కెరీర్‌కు మంచి ప్లస్ అవుతుంది.
* ‘అటాక్’ సినిమా గురించి?
- అదొక పొలిటికల్ యాక్షన్ సినిమా. అందులో నేను కార్ మెకానిక్ పాత్రలో కన్పిస్తాను. చాలా కొత్త అనుభూతి. ఆ సినిమా రిలీజ్‌కోసం వెయిట్ చేస్తున్నా.
* మీ పర్సనల్ లైఫ్‌లో ఎలా వుంటారు?
- లైఫ్ పట్ల నాకు చాలా ఆసక్తి. అలాగే, వర్క్ కమిట్‌మెంట్‌తో చేస్తాను. నా సంతోషం నాకు ముఖ్యం. సంతోషం వుంటే ఏ పనైనా చేస్తాను.
* తదుపరి చిత్రాలు?
- నాని హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. తమిళంలో ‘జై’ హీరోగా ఓ సినిమా చేశాను.

-యు