విక్రమ్‌తో జోడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పెళ్లిచూపులు’ సినిమా తెలుగు సినీ పరిశ్రమలో ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఆ సినిమాలో నటించిన వారంతా ఇప్పుడు పాపులర్ అయ్యారు. ఇక ఆ సినిమాలో హీరోయిన్‌గా నటించి అందరినీ ఆకట్టుకున్న రీతూవర్మ తమిళ స్టార్ హీరో విక్రమ్ సినిమాకు హీరోయిన్‌గా ఎంపికవ్వడం విశేషం. గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘్ధృవ నచ్చత్తిరం’ సినిమాకు మొదట అను ఎమ్మాన్యూల్‌ను కథానాయికగా ఎంపిక చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటో షూట్స్ కూడా జరిగాయి. కాగా డేట్స్ కుదరక అను ఈ ప్రాజెక్టునుంచి తప్పుకున్నారట. దీంతో వెంటనే దర్శకుడు గౌతమ్‌మీనన్ రీతూవర్మను ఎంపిక చేశారట. రీతూ ఇప్పటికే సెట్స్‌లో జాయినైపోయినట్లు కూడా తెలుస్తోంది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రీతూ చేస్తోన్న పాత్రకు కూడా మంచి ప్రాధాన్యత ఉంటుందట. ఆగస్టు నెలలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా గౌతమ్‌మీనన్ ప్లాన్ చేస్తున్నారు.