భరత్‌తో కొత్త హీరోయిన్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ మహేష్‌బాబు ప్రస్తుతం నటిస్తున్న సినిమా షూటింగ్ చివరి షెడ్యూల్ త్వరలోనే మొదలుకానుంది. క్రేజీ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రం తరువాత మహేష్, కొరటాల శివతో సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్‌వర్క్‌తోపాటు ప్రీప్రొడక్షన్ పనులు కూడా పూర్తికావచ్చిన ఈ చిత్రాన్ని త్వరలోనే లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట కొరటాల. అంతేకాదు ఈ సినిమా కోసం కొత్త హీరోయిన్‌ని దించాలనే ప్లాన్ చేశాడట. అందులో భాగంగా కొత్త మోడల్స్, కొత్త అమ్మాయిలను వెదికే పనిలో పడ్డాట. కొత్త హీరోయిన్ అయితే ఫ్రెష్ ఫీల్ వస్తుంది కాబట్టి. ఇక ఈ చిత్రం మార్చి చివరిలో ప్రారంభం కానుందని, ఇప్పటికే ఈ సినిమాకు ‘్భరత్ అను నేను’ అనే టైటిల్ పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘శ్రీమంతుడు’ హిట్ తరువాత వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చే సినిమా అంటే అంచనాలు ఎలా ఉంటాయో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. మరి మహేష్ సరసన ఛాన్స్ కొట్టేసే ఆ కొత్త హీరోయిన్ ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది?