ఆశ..దోశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోలీవుడ్ యంగ్ హీరో జై, తెలుగింటి సీతమ్మ అంజలితో ప్రేమాయణంలో మునిగితేలుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయమై నోరువిప్పకుండా ఇన్నాళ్లూ దాగుడుమూతలు ఆడుతోంది ఈ జంట. వీరి షికార్ల గురించి మీడియాలో ప్రముఖంగా ప్రచారమైనా ఆ వార్తలపై స్పందించనేలేదు. ఏదైతేనేం ఒక దోశ స్కీమ్ వర్కవుటై అసలు గుట్టు బయటికొచ్చింది. హీరో సూర్య విసిరిన దోశ ఛాలెంజ్‌ను తీసుకుని దాన్ని అంజలితో కలిసి చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు జై. దీంతో ఈ ఇద్దరి మధ్య బంధం ఎలాంటిదో అందరికీ అర్థమైంది. త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నట్లు కోలీవుడ్‌లో ప్రస్తుతం ప్రచారమవుతోంది. జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన ‘మగళిర్ ముట్టమ్’ మూవీ టీజర్ రీసెంట్‌గా విడుదలైన సంగతి తెలిసిందే. ఇంట్లో అందరికోసం లెక్కకు మించి దోశలు వేసే అమ్మ, శ్రీమతికోసం ఎవరైనా ఒక్క దోశ అయినా వేశారా? అంటూ ఒక డైలాగ్ వుంది. దాంతో సూర్య జ్యోతిక కోసం ఒక దోశను వేసి పలువురికి ఛాలెంజ్ వేశాడు. ఈ నేపథ్యంలో హీరో జై ఒక దోశను వేసి దాన్ని అంజలికి ఇస్తూ ఓ ఫొటోను తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అదీ విషయం