కొన్ని సన్నివేశాల్లో ఎన్టీఆర్ ఏడ్చేశారు! ( దర్శకుడు సుకుమార్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తండ్రీ కొడుకులమధ్య వుండే సెంటిమెంట్‌తో
ఇప్పటివరకూ చాలా చిత్రాలు వచ్చాయి. కానీ వాటికి ఈ సినిమాకూ చాలా తేడా వుంటుంది. ముఖ్యంగా ఎమోషన్ విషయంలో ప్రేక్షకుడికి దగ్గరగా కనెక్ట్ అయ్యే అంశమిది. తండ్రికోసం ఓ కొడుకు ఏం చేశాడు అనే అంశంగా సాగుతుంది. నిజానికి ఎన్టీఆర్‌కు ముందు వేరే కథ చెప్పాను. ఆ తరువాత మా నాన్న మృతి చెందడంతో బాగా ఎమోషన్‌గా ఫీలయ్యాను. ఆ సమయంలో వచ్చిన ఆలోచనే ఇది.
కథ చెప్పగానే ఎన్టీఆర్ చాలా ఎగ్జైట్ అయ్యాడు.

సుకుమార్ తెలుగు పరిశ్రమలో విభిన్నమైన సినిమాలతో దర్శకునిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఆయన సినిమాలు కొత్తగా వుంటాయి. ఆయన కథానాయకులు అందరికంటే భిన్నంగా ప్రవర్తిస్తారు. మొత్తానికి మనిషిలోని ఎమోషన్స్‌ని దగ్గరగా పరిచయం చేసే ప్రయత్నం చేస్తారు సుకుమార్. తాజాగా ఆయన రూపొందించిన చిత్రం ‘నాన్నకు ప్రేమతో’. ఎన్టీఆర్ హీరోగా రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర సినీ క్రియేషన్స్ పతాకంపై భోగవల్లి ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం ఈరోజు విడుదలవుతున్న సందర్భంగా సుకుమార్ చెప్పిన విశేషాలు...
తండ్రీ కొడుకుల సెంటిమెంట్
తండ్రీ కొడుకులమధ్య వుండే సెంటిమెంట్‌తో ఇప్పటివరకూ చాలా చిత్రాలు వచ్చాయి. కానీ వాటికి ఈ సినిమాకూ చాలా తేడా వుంటుంది. ముఖ్యంగా ఎమోషన్ విషయంలో ప్రేక్షకుడికి దగ్గరగా కనెక్ట్ అయ్యే అంశమిది. తండ్రికోసం ఓ కొడుకు ఏం చేశాడు అనే అంశంగా సాగుతుంది. నిజానికి ఎన్టీఆర్‌కు ముందు వేరే కథ చెప్పాను. ఆ తరువాత మా నాన్న మృతి చెందడంతో బాగా ఎమోషన్‌గా ఫీలయ్యాను. ఆ సమయంలో వచ్చిన ఆలోచనే ఇది. కథ చెప్పగానే ఎన్టీఆర్ చాలా ఎగ్జైట్ అయ్యాడు.
హీరోలు భిన్నంగా వుండరు
నా సినిమాల్లో హీరోలు భిన్నంగా ప్రవర్తిస్తారని చాలామంది అంటుంటారు. నిజానికి ప్రతి మనిషిలో ఏదో భావన వుంటుంది. దాన్ని దగ్గరగా చూడాలన్నదే నా ప్రయత్నం. మనిషిలోని ఏ రకం ఎమోషనైనా నాకు బాగా అన్పిస్తాయి. అందుకే నా హీరోలు అలా బిహేవ్ చేస్తుంటారు.
ఎన్టీఆర్ చేయకుంటే
ఈ కథ ఎన్టీఆర్ చేయకుంటే వేరే ఏ హీరోతో సినిమా చేయను. ఈ పాత్రను అనుకున్నపుడు ఎన్టీఆర్ మాత్రమే చేయగలడనిపించింది. ఎందుకంటే అతని ముఖంలో ఏదో ఒక ఫీలింగ్ కనిపిస్తుంటుంది. కథ చెప్పగానే పాత్రలోకి లీనమయ్యాడు. కొన్ని సన్నివేశాలు తీస్తున్నపుడు నిజంగానే ఏడ్చేశాడు కూడా. అంతలా ఈ సినిమాను చేశాడు. మనం ఎంతకాలం బతికుంటామో తెలీదు. ఉన్నంతలో అందరితో కలిసి వుండాలి అన్నది నా సిద్ధాంతం. నేను చేసే సినిమాల విషయంలో అలాగే ప్రవర్తిస్తుంటాను. నా యూనిట్ అందరితో లవ్‌లో పడిపోతాను. అలాగే ఈ సినిమాతో ఎన్టీఆర్‌తో స్నేహం బాగా పెరిగింది. ప్రస్తుతానికి నేను ఆయనకు అడిక్ట్ అయ్యాను.
వెంటనే పట్టేస్తాడు
ఎన్టీఆర్ ఈ సినిమాలో అభిరామ్ అనే పాత్రలో కన్పిస్తాడు. ఈ గెటప్ ఎలా వుండాలన్న ఆలోచన తనదే. నటన విషయంలో మంచి డెడికేషన్ వుంది. నిజానికి చెప్పాలంటే ప్రతి మనిషికి మూడు స్టేజీలుంటాయి. ఒకటి తెలుసుకోవడం, రెండు నేర్చుకోవడం, మూడోది ఆచరించడం. కానీ ఎన్టీఆర్‌కు మాత్రం రెండు స్టేజ్‌లే. మొదటి తెలుసుకోవడం రెండవది ఆచరించడం. తనకు చెప్పిన విషయాన్ని వెంటనే పట్టేస్తాడు. గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ. తను చూస్తే నాకు అసూయ కలుగుతుంది. ఇంత తొందరగా ఎలా పట్టేస్తాడా అని. అలాగే అతని ప్రేమ కూడా తుపానులా వుంటుంది.
మహేష్ కోసం సినిమా చేయాలి
ఒక సినిమా ఫ్లాప్ అయిన తరువాత కూడా ఆ దర్శకుణ్ణి హీరో, నిర్మాతలు ఇంతగా అభిమానించడం చూస్తుంటే నాకే సిగ్గేస్తోంది. మహేష్‌బాబుతో తీసిన ‘1’ చిత్రం ప్లాఫ్ అయినా కూడా ఆయన అభిమానం నాపై ఏ మాత్రం తగ్గలేదు. ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని ఆ సినిమాతో వమ్ము చేశాను. మళ్లీ మహేష్‌బాబు, 14 రీల్స్ బ్యానర్‌కు ఓ మంచి సినిమా చేయాలి.
తదుపరి సినిమాలు
ప్రస్తుతానికి మూడు నెలలు రెస్ట్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను. ఆ తరువాత ఏ సినిమా వుంటుందనేది తెలియజేస్తా.

-శ్రీ