నాగ్ కెరీర్‌లో కలికితురాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున-కె.రాఘవేంద్రరావుల కాంబినేషన్‌లో సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందిన ఓం నమో వేంకటేశాయ చిత్రం శుక్రవారం విడుదలై అన్ని కేంద్రాల్లో మంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా సినీ ప్రముఖుల కోసం ఒక రోజు ముందుగానే హైదరాబాద్‌లో ప్రివ్యూ షోను ప్రదర్శించారు. ఈ షోను చూసిన మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ- ‘ఈ సినిమా చూడడమే అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్‌లా వుంది. భక్తిపారవశ్యాలు పెల్లుబుకుతాయి. సెకెండాఫ్ హృద్యంగా వుండడమే కాదు, కళ్లు చెమర్చాయి. ప్రతి సన్నివేశం అద్భుతంగావుంది. ఈ సినిమా చూడడం భక్తితో కూడిన ప్రయాణం చేసినట్టు అనిపించింది. ఇలాంటి సినిమాలు తీయాలంటే రాఘవేంద్రరావుగారే, ఇలాంటి సినిమాలు చేయాలంటే నా మిత్రుడు నాగార్జునకే చెల్లుతుంది. ముఖ్యంగా ఇంత మంచి చిత్రాన్ని నిర్మించిన మహేష్‌రెడ్డిని అభినందిస్తున్నాను. గతంలో అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడీ సాయి చిత్రాలకు ధీటుగా వుండే చిత్రమిది. నాగార్జున కెరీర్‌లో ఈ చిత్రం ఒక కలికితురాయి. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ దివ్యానుభూతికి లోనవుతారు’ అన్నారు. దిల్‌రాజు మాట్లాడుతూ- ‘ఈ చిత్రం ఒక అద్భుతం. సినిమా చివరి అరగంట కన్నీళ్లు పెట్టించాడు. అన్నమయ్య తరువాత అలాంటి గొప్ప వేంకటేశ్వరస్వామి చిత్రాన్ని అందించిన నాగార్జున-రాఘవేంద్రరావులకు ధన్యవాదాలు’ అన్నారు. దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ- ‘ఈ సినిమా గురించి చెప్పాలంటే మాటలు రావడంలేదు. అన్నమయ్య తరువాత అంత గొప్ప అద్భుతాన్ని క్రియేట్ చేశారు. ప్రతిఒక్కరూ తప్పకుండా చూడాల్సిన చిత్రం ఇది’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పి.వి.సింధు, పి.వి.పి, నాగసుశీల, నిమ్మగడ్డ ప్రసాద్, దానం కిశోర్ తదితరులు పాల్గొన్నారు.