పూరి సినిమా.. సల్మాన్ రీమేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రస్తుతం చేస్తున్న ‘రోగ్’ చిత్రంలో ఇషాన్ హరోగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాపై ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తున్నది. ఈ చిత్రాన్ని హిందీలో సల్మాన్‌ఖాన్ రీమేక్ చేయనున్నాడట. అయితే ఆ సినిమాలో సల్మాన్‌ఖాన్ హీరోగా నటించకుండా సూరజ్ పంచోలిని కథానాయకుడిగా ఎన్నుకున్నారని సమాచారం. ఎప్పటినుంచో పూరి-సల్మాన్‌ఖాన్‌లు మంచి స్నేహితులు. ఆ చొరవతోనే ఇప్పటిదాకా తీసిన రోగ్ చిత్రాన్ని సల్మాన్‌ఖాన్‌కు చూపించాడట పూరి జగన్నాథ్. సినిమా చూసిన వెంటనే మెచ్చుకున్న ఆయన హిందీ లో రీమేక్ చేస్తానని మాట ఇచ్చాడట. పూరి కూడా ఒప్పుకోవడంతో ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ కార్యక్రమాలు మొదలయ్యాయని, త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నారని తెలుస్తోంది.