విభిన్న ప్రేమకథగా ‘గువ్వా గోరింక’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్యదేవ్ హీరోగా, ప్రియాలాల్ హీరోయిన్‌గా ఆకార్ మూవీస్ పతాకంపై మోహన్ బొమ్మిడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ దాము కొసనం, జీవన్‌రెడ్డి నిర్మిస్తున్న విభిన్న ప్రేమకథా చిత్రం ‘గువ్వా గోరింక’. ఈ చిత్రానికి ఫస్ట్‌లుక్‌ను శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలను తెలియజేస్తూ- విభిన్న మనస్తత్వం కలిగిన ఇద్దరు ప్రేమికుల కథ ఇదని, రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్‌ను ప్రేమికుల రోజున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. ఇప్పటివరకు హైదరాబాద్, అన్నవరం, వరంగల్‌లలో జరిగిన షూటింగ్‌తో 70 శాతం చిత్రీకరణ పూర్తయిందని, కొత్త తరహా సినిమాల్ని ఇష్టపడే ప్రేక్షకులకు వినూత్న అనుభూతిని పంచుతుందనే నమ్మకుందని తెలిపారు. చైతన్య, మధుమిత, పెళ్లిచూపులు ప్రియదర్శి, ప్రభాకర్, ఫిష్ వెంకట్, సత్యప్రియ తదితరుల నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:సురేష్ బొబ్బిలి, కెమెరా:మైల్స్ రంగస్వామి, దర్శకత్వం:మోహన్ బొమ్మిడి.