పల్లెటూరు పిల్లగా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామసూత్ర సినిమాతో ప్రేక్షకులకు హీటెక్కించిన హాట్‌గాళ్ షెర్లిన్‌కు ఆ సినిమా విడుదల కాకపోవడంతో ఎంతో క్రేజ్ తెచ్చుకుంటాననుకున్న కలలు కల్లలయ్యాయి. ఇండియానుండి మొదటిసారి ప్లేబాయ్ మేగ్‌జైన్‌కోసం మోడల్‌గా మారి న్యూడ్ ఫొటోలతో అదరగొట్టిన ఈ అమ్మడికి బాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు రాలేదు. పోనీ తెలుగులో ట్రై చేద్దామా అంటే ఇక్కడా పరిస్థితి బాగోలేదు. మొత్తానికి ఓ హిందీ సినిమా చేస్తోంది. అది కూడా చిన్న సినిమానే. ఆ సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా నటిస్తోందట. అందుకోసం నిజంగానే పల్లెటూరి అమ్మాయి ఎలా వుంటుందో స్టడీ చేయడానికి ఓ పల్లెటూరికి వెళ్లి అక్కడి పద్ధతులను దగ్గరుండి గమనించిందట. అంతేకాదు, అక్కడ పేడ పిసికి పిడకలు వేస్తూ పొటోకు ఫోజిచ్చింది ఈ అమ్మడు. న్యూడ్ అందాలతో హీటెక్కించిన షెర్లిన్‌ను ఇలా చూసినవారంతా షాక్ తిన్నారట. నిజంగా షెర్లిన్ పల్లెటూరి అమ్మాయిగా బాగుందని వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఈ పాత్రలో అయినా క్లిక్ అవుతుందేమో చూడాలి.