వేసవికి రానున్న గురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటేష్ కథానాయకుడిగా సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘గురు’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని వేసవి కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా దర్శకురాలు సుధ మాట్లాడుతూ- స్ట్రాంగ్ ఎమోషన్‌లతో వుండే ఆటలకు సంబంధించిన డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించామని, ఈ నెల 17న పాటను విడుదల చేయనున్నామని తెలిపారు. వెంకటేష్‌ను ఇప్పటివరకూ చూడని సరికొత్త లుక్‌లో చూపిస్తున్నామని, విడుదల తేదీని త్వరలో తెలియజేస్తామని నిర్మాత శశికాంత్ తెలిపారు. రితికాసింగ్, ముంతాజ్ సర్కార్, నాజర్, తనికెళ్ల భరణి, రఘుబాబు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:సంతోష్ నారాయణ్, కెమెరా:కె.ఎ.శక్తివేల్, ఎడిటింగ్:సతీష్ సూర్య, పాటలు:రామజోగయ్య శాస్ర్తీ, భాస్కరభట్ల, శ్రీమణి, మాటలు:హర్షవర్థన్, నిర్మాత:ఎస్.శశికాంత్, దర్శకత్వం:సుధా కొంగర.