చంద్రముఖి పాత్రలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య దక్షిణాది హీరోయిన్లు గ్లామర్ వదిలిపెట్టి హారర్ పాత్రలవైపు మళ్లారు. ఇప్పటికే పలు హారర్ చిత్రాలతో చాలామంది హీరోయిన్లు సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కూడా. లేటెస్టుగా ఈ లిస్టులోకి చేరనుంది మరో గ్లామర్ భామ తమన్నా. క్రేజీ హీరోయిన్‌గా తమిళ, తెలుగుభాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఇప్పుడు చంద్రముఖి పాత్రలో నటించనుంది. అప్పట్లో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘చంద్రముఖి’ చిత్రం సంచలన విజయం సాధించింది. దానికి సీక్వెల్‌గా రూపొందిన ‘నాగవల్లి’ చిత్రం అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఈ సినిమాకు కూడా రజనీకాంత్‌ని అడిగితే ఆయన చేయనన్నారు. దాంతో వెంకటేష్‌తో ఆ చిత్రాన్ని రూపొందించారు. ఇపుడు ‘నాగవల్లి’ చిత్రం తమిళంలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు దర్శకుడు వాసు. ఈ చిత్రంలో ‘చంద్రముఖి’గా తమన్నా నటిస్తోందని వార్తలొస్తున్నాయి. ఇందులో రజనీకాంత్ హీరోగా నటిస్తాడని, ప్రస్తుతం ఆయనతో చర్చలు జరుపుతున్నాడని అంటున్నారు.