నాగ్ చెప్పాకే ఒప్పుకున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగాస్టార్‌గా తెలుగుతెరపై తిరుగులేని ఇమేజ్‌ని స్వంతం చేసుకున్న చిరంజీవి ఎనిమిదేళ్ల గ్యాప్ తరువాత రీఎంట్రీ ఇస్తూ నటించిన ‘ఖైదీ నెం 150’ చిత్రంతో తన సత్తా తగ్గలేదని, ప్రేక్షకుల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడని మరోసారి నిరూపించుకున్నాడు. ఈ చిత్రం విడుదలై 100 కోట్ల మార్కెట్ దాటి సంచలనం రేపింది. ప్రస్తుతం వున్న హీరోలకు ఈ సినిమాతో తాను పోటీ ఇస్తున్నానని చెప్పకనే చెప్పాడు. ఈ సినిమా తరువాత చిరంజీవి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. మాటీవీలో రూపొందిన ఈ కార్యక్రమం నేటినుంచీ ప్రసారం కానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి చెప్పిన విశేషాలు..
అనుమానాలుండేవి
దాదాపు తొమ్మిదేళ్ల తరువాత మళ్లీ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాను, ఇలాంటి సమయంలో ప్రేక్షకులు నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే అనుమానాలు వుండేవి. దానికోసం చాలా టెన్షన్ పడ్డాను. కానీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ప్రేక్షకులు నాకు దిగ్విజయాన్ని అందించారు. తెలుగు ప్రేక్షకులు ఒక్కసారి అభిమానిస్తే, ప్రేమిస్తే ఎప్పటికీ మర్చిపోరని నేనే ఒక సినిమాలో చెప్పాను. అది నిజం చేశారు.
మరింత చేరువగా
‘ఖైదీ నెం 150’ సినిమాతో ప్రేక్షకుల హృదయాలలో వున్నానన్న నమ్మకం కలిగిన తరువాత ఈ షోతో మరింత చేరువగా వారికి దగ్గరయ్యేలా నాకు వచ్చిన అవకాశంగా భావిస్తున్నాను. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో చేసే టప్పుడు చాలా అనుభూతులకు లోనయ్యా.
మొదట్లో వద్దనుకున్నా
నాగార్జున చేస్తున్న షో అప్పటికే మంచి ప్రజాదరణ పొందింది. అలాంటి సమయంలో ఈ షోలో హోస్ట్‌గా చేయమని నాకు ఆఫర్ రావడంతో షాక్ అయ్యా. ముందుగా షో చేయద్దని అనుకున్నాను. ఈ విషయాన్ని నాగార్జునకు కూడా చెప్పా. ఆయన లేదు, తప్పకుండా చేయాలన్నారు. ఎందుకంటే ఆ కార్యక్రమాన్ని ఇంకాస్త ఎలివేట్ చేయాలంటే హోస్ట్ మారితే బాగుంటుందని అనుకున్నామని చెప్పాడు. దాంతో సరే అని ఒప్పుకున్నా.
ఎంటర్‌టైన్‌మెంట్ కాదు
ఈ షోలో చాలా అనుభూతులున్నాయి. కష్టాలు, సుఖాలు, నవ్వులు, ఆనందాలు, బాధలు- ఇలా అన్ని అనుభూతుల్ని దగ్గరుండి చూశా. ఇది ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రాం కాదు, ఎమోషనల్ ప్రోగ్రాం. ఈ కార్యక్రమానికి సామాన్య ప్రేక్షకులతోపాటు అప్పుడప్పుడు సినీ సెలబ్రిటీలు కూడా వస్తారు. నాగార్జున చేసేటప్పుడు నేనూ పాల్గొన్నాను. ఇప్పుడు నా షోకు నాగ్ వస్తున్నాడు.
బాలకృష్ణను కూడా పిలుస్తా
ఈ షోలో బాలకృష్ణను కూడా పిలవాలనుంది. తను నాకు చాలా మంచి మిత్రుడు. సినిమాల పరంగా మాకేదైనా పోటీ ఉండొచ్చుకానీ, పర్సనల్‌గా మేం చాలా మంచి ఫ్రెండ్స్.
అమితాబ్ ప్రశంస
ఈ షో వెండితెరపై ఎలాంటి ప్రభావం వుంటుందో అలాంటి ప్రభావమే టీవీల్లో కూడా వుంటుంది. ఈ కార్యక్రమాన్ని నేను బాగా చేస్తున్నాని తెలిసి బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్‌బచ్చన్ నన్ను అభినందించడం ఆనందంగా వుంది. మాటీవీని ప్రపంచ స్థాయి చానల్ అయిన స్టార్ టీవీలో లీనమవ్వడం మొదట్లో బాధనిపించింది. కానీ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యేందుకు వారు చేస్తున్న కృషి చూసి ఆనందంగా వుంది. ఈ షో చేస్తూనే అటు సినిమాలు కంటిన్యూ చేస్తా.

-శ్రీ