ప్రేమలోని కొత్తకోణాన్ని ఆవిష్కరించాం - దర్శకురాలు బి.జయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేమలో పావని కళ్యాణ్, చంటిగాడు, లవ్‌లీ వంటి లవ్‌స్టోరీస్‌ని అందించిన ఆర్.జె. సినిమాస్ బేనర్‌నుంచి మరో ప్రేమకథా చిత్రం ‘వైశాఖం’ వస్తోంది. హరీష్, అవంతిక జంటగా ఆర్.జె. సినిమాస్ పతాకంపై డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ.బి దర్శకత్వంలో బి.ఎ.రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు సందర్భంగా అందరికీ వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘వైశాఖం’ చిత్ర విశేషాలను తెలియజేశారు.
డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ.బి మాట్లాడుతూ- ‘‘ప్రేమలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే సినిమా ఇది. వైశాఖ మాసానికి చాలా ప్రాముఖ్యత, ఎంతో పవిత్రత వుంది. అందుకే ఈ మాసంలోనే ఎక్కువగా పెళ్లిళ్లు జరుగుతుంటాయి. శ్రీనివాసుడు పద్మావతిని వివాహం చేసుకున్నది ఈ మాసంలోనే. ‘వైశాఖం’ చిత్రం ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే లవ్‌స్టోరీ. ఒక అమ్మాయి వైశాఖంలో ఒక అబ్బాయి జీవితంలోకి ఎంటర్ అయి అతనిలో ఎలాంటి మార్పును తీసుకొచ్చింది, వీరి ప్రేమ ప్రయాణం వైశాఖంలో పెళ్లివరకు ఎలా వెళ్లింది అనేది కథ. స్క్రీన్‌ప్లే చాలా డిఫరెంట్‌గా వుంటుంది’’ అన్నారు.
నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ- ‘‘ప్రేమలో పావని కళ్యాణ్’, ‘చంటిగాడు’, ‘గుండమ్మగారి మనవడు’ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే లవ్‌స్టోరీస్. ‘లవ్‌లీ’ సిటీ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన లవ్‌స్టోరీ. మా బేనర్‌లో లవ్ ఓరియెంటెడ్ మూవీస్ ఎక్కువగా తీశాము. అన్నీ మంచి సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో తీసిన డిఫరెంట్ లవ్‌స్టోరీ ‘వైశాఖం’. షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ ఫాస్ట్‌గా జరుగుతోంది. బిజినెస్ పరంగా చాలా మంచి ఆఫర్స్ వున్నాయి. సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు.
హీరో హరీష్ మాట్లాడుతూ- ‘‘వైశాఖం వంటి మంచి సినిమాలో చెయ్యడం ఎంతో ఛాలెంజింగ్‌గా వుంది. ఈ క్యారెక్టర్‌లో చాలా వేరియేషన్స్ వుంటాయి. నన్ను చాలా అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. ఈ సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. లవర్స్‌ని బాగా ఎట్రాక్ట్ చేసే ఈ సినిమా ఫ్యామిలీస్‌ని కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది’’ అన్నారు. హీరోయిన్ అవంతిక మాట్లాడుతూ- ‘‘ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా వుంటుంది. షూటింగ్ చేస్తున్నప్పుడే బాగా ఎంజాయ్ చేశాను. ఈ సినిమా చేయడం థ్రిల్‌గా ఫీల్ అయ్యాను. నా ఫ్యూచర్‌కి జయ ‘వైశాఖం’ గట్టి ఫౌండేషన్ అవుతుంది. ఇది యూత్‌ని బాగా ఆకట్టుకునే మంచి లవ్‌స్టోరీ’’ అన్నారు.
హరీష్, అవంతిక జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో డైలాగ్ కింగ్ సాయికుమార్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు.