విన్నర్ వస్తున్నాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయిధరమ్ తేజ్, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మధు సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘విన్నర్’. ఈ చిత్రానికి సంబంధించిన థియేటర్ ట్రైలర్‌ను ఇటీవల యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ- యూట్యూబ్‌లో విడుదల చేసిన ట్రైలర్‌ను దాదాపు రెండు మిలియన్ల నెటిజన్లు చూశారని, దీనితోనే సినిమాపై భారీ అంచనాలు పెరిగాయని తెలిపారు. పులికి ఎదురెళ్లే ధైర్యం, పాతికమందిని మట్టుబెట్టే బలం, గడ్డిపోచగా తీసిపారేసేవాళ్ల గుండెల్లో గడ్డపారలా దిగే తెగువ ఓ కుర్రాడి స్వంతమైతే, అతని గెలుపు ఏ విధంగా వుంటుంది అనే కథనంతో ఈ చిత్రాన్ని రూపొందించామని, మహాశివరాత్రి కానుకగా ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు విన్నర్‌ను తీసుకువస్తున్నామని వారు తెలిపారు. ట్రైలర్‌లో చూపించిన విధంగా ప్రతి డైలాగ్‌కు థియేటర్‌లో మంచి స్పందన లభిస్తుందని, టర్కీలో భారీ బడ్జెట్‌తో రూపొందించిన హార్స్ రేసింగ్ సన్నివేశాలు చిత్రంలో హైలెట్‌గా వుంటాయని అన్నారు. తనకు జన్మనిచ్చిన తండ్రిని, మనసిచ్చిన అమ్మాయిని గెలవడంకోసం ఓ యువకుడు చేసిన పోరాటమే ఈ సినిమా కథనమని, తమన్ అందించిన సంగీతంలో పాటలన్నీ బాగున్నాయని, సాయిధరమ్‌తేజ్, రకుల్‌ప్రీత్‌సింగ్ ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ సరికొత్తగా వుంటుందని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ప్రస్తుతం చివరిపాట చిత్రీకరణ జరుపుతున్నామని కథానాయకుడు సాయిధరమ్‌తేజ్ తెలిపారు. జగపతిబాబు, ముఖేష్‌రుషి, అలీ, వెనె్నల కిశోర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:చోటా కె నాయుడు, సంగీతం:తమన్, కథ:వెలిగొండ శ్రీనివాస్, మాటలు:అబ్బూరి రవి, స్క్రీన్‌ప్లే,
దర్శకత్వం:గోపీచంద్ మలినేని.