జగన్నాథం జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లు అర్జున్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై హరీష్ ఎస్.శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘డి.జె’ (దువ్వాడ జగన్నాథమ్) చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ ఈనెల 18న విడుదల కానుంది. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత రాజు మాట్లాడుతూ- గతంలో తమ సంస్థ రూపొందించిన ‘ఆర్య’, ‘పరుగు’ చిత్రాల స్థాయిలోనే ఈ చిత్రం ఉంటుందని తెలిపారు. కమర్షియల్‌గా సూపర్‌హిట్ అయ్యేందుకు కావాల్సిన అన్ని హంగులను ఈ చిత్రంలో పొందుపర్చామని, ఇప్పటికే బన్నీ-దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కనుక భారీ అంచనాలు ఉన్నాయని తెలిపారు. అటు పరిశ్రమ, ఇటు ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఈనెల 18న ఫస్ట్‌లుక్‌ను, టీజర్‌ను మహాశివరాత్రి కానుకగా 24న విడుదల చేయనున్నామని తెలిపారు. ప్రస్తుతం కర్నాటకలో షూటింగ్ జరుపుతున్నామని, చిత్రంలో నటీనటులందరూ ఇక్కడ పాల్గొంటాన్నారని అన్నారు. తరువాత షెడ్యూల్ ఈనెలాఖరుకు అబూదాబిలో చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, సూపర్‌హిట్ ట్రాక్‌లో సాగే అన్ని పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని ఆయన తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా:ఐనాక బోస్, సంగీతం:దేవిశ్రీ ప్రసాద్, ఫైట్స్:రామ్‌లక్ష్మణ్, ఎడిటింగ్:గౌతంరాజు, స్క్రీన్‌ప్లే:రమేష్‌రెడ్డి, దీపక్‌రాజ్, నిర్మాత:రాజు, కథ, మాటలు, దర్శకత్వం:హరీశ్ ఎస్.శంకర్.