శ్రీకృష్ణదేవరాయలు కోసం క్రిష్ కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లేటెస్టుగా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమాతో సంచలనం క్రియేట్ చేసిన క్రిష్, ఆ సినిమాతో బాలయ్యను యాభై కోట్ల మార్కెట్‌లోకి చేర్చింది. ఈ సినిమాతో ఓవర్‌సీస్ మార్కెట్‌లో కూడా క్రేజ్ దక్కి ఏకంగా 2 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అఖండ భారతాన్ని పాలించిన తెలుగు చక్రవర్తి శాతకర్ణి కథను తెలుగు ప్రేక్షకులకు అందించిన క్రిష్ ఇప్పుడు మరో రెండు చారిత్రక సినిమాలు తీయడానికి ప్లాన్ చేస్తున్నాడు? ఇంతకీ ఆ రెండు కథలు ఏమిటో తెలుసా? ఒకటి తెలుగువారిని పాలించిన తన ఖ్యాతిని మరింత పెంచుకున్న శ్రీకృష్ణదేవరాయలు కథ ఒకటైతే, గౌతమబుద్ధుడి కథ మరొకటి? నిజంగా ఈ రెండు కథలు గొప్ప చరిత్ర కలిగిన కథలు కావడం.. ఈ కథలను తెలుగువారికి తెలియచెప్పాలనుకోవడం నిజంగా గొప్ప విషయమే! మరి ఇప్పటికే స్క్రిప్ట్‌వర్క్ మొదలుపెట్టాడని తెలిసింది. సో త్వరలో దీనికి సంబంధించిన సినిమా పట్టాలు ఎక్కే ఛాన్స్ దగ్గరలోనే వుంది!