ముస్తాబవుతున్న కాటమరాయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవన్‌కల్యాణ్, శ్రుతిహాసన్ జంటగా నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కిశోర్ పార్థాసాని దర్శకత్వంలో శరత్ మరార్ రూపొందిస్తున్న ‘కాటమరాయుడు’ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ముగింపు దశలో వుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ స్టిల్‌ను మంగళవారం విడుదల చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికే సినిమాకు సంబంధించిన ఆదరణ సాక్ష్యంగా నిలుస్తోందని, సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయని దర్శకుడు తెలియజేశారు. ఉగాదికి అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి మార్చి 29న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. అలీ, నాజర్, రావురమేష్, అజయ్, నర్రా శ్రీను, పృధ్వీ, శివబాలాజీ, కమల్ కామరాజు, చైతన్యకృష్ణ, తరుణ్ అరోరా, ప్రదీప్ రావత్, పవిత్రా లోకేష్, రజిత, యామిని భాస్కర్, అస్మిత, రమాదేవి, భానుశ్రీ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:అనూప్ రూబెన్స్, కెమెరా:ప్రసాద్ మూరెళ్ల, దర్శకత్వం:కిశోర్ పార్థాసాని.