గ్లామర్ మంత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమధ్య ఎం.ఎస్.రాజు దర్శకత్వంలో ఆయన తనయుడు సుమంత్ అశ్విన్‌ని హీరోగా పరిచయం చేస్తూ రూపొందించిన ‘తూనీగ తూనీగ’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రియా చక్రవర్తికి ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో పాపం ఆ తరువాత పెద్దగా అవకాశాలు రాలేదు. తరువాత ఒకటి రెండు సినిమాలు చేసిన ఈ అమ్మడికి ఇక్కడ వర్కవుట్ కాదని తెలుసుకుని బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ గట్టి ప్రయత్నాలే చేసినా పెద్దగా లాభం లేకపోయింది. దాంతో కొంత గ్యాప్ ఇచ్చి.. ఇక గ్లామరే శరణ్యం అని అనుకుందో ఏమో.. అందుకే హాట్‌గా ఫొటోలకు ఫోజులిస్తూ రెచ్చిపోయి హీటెక్కిస్తోంది. పైగా ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన క్రేజ్‌ని పెంచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తుంది. ఈ అమ్మడి హాట్ ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరి ఈ గ్లామర్ మంత్రంతో ఈ తూనిగ అవకాశాలను పట్టేస్తుందో లేదో చూడాలి!