వినాయక్ దర్శకత్వంలో బాలకృష్ణ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లేటెస్టుగా ‘ఖైదీ నెం 150’ సినిమాతో మంచి కమర్షియల్ విజయాన్ని అందుకున్నాడు వినాయక్. మిగతా స్టార్ హీరోలు అందరూ కమిట్‌మెంట్‌తో ఉండడంతో వినాయక్ తరువాతి సినిమా ఏమిటా? అనే సందేహాలు అందరిలో మొదలయ్యాయి. ఇప్పటికే సాయిధరమ్‌తేజ్‌తో ఒక సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. కానీ అది వర్కవుట్ అయ్యేలా కనిపించడంలేదు. ఐతే ప్రస్తుతం వినాయక్ మెగా క్యాంప్ నుంచి నందమూరి ఫ్యామిలీకి షిప్ట్ అయ్యాడనే టాక్ వినిపిస్తోంది. రీసెంట్‌గా నందమూరి బాలకృష్ణను కలిసిన వినాయక్, ఓ ప్రాజెక్టుపై దాదాపు ఒప్పించాడని అంటున్నారు. ప్రస్తుతం సీనియర్ రైటర్స్ కొందరు స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నారట. అప్పట్లో వినాయక్ బాలయ్యతో చెన్నకేశవరెడ్డి సినిమా తీసిన విషయం తెలిసిందే. కమర్షియల్‌గా ఆ సినిమా అంతగా వర్కవుట్ కాలేదు. కానీ బాలయ్యకు మంచి క్రేజ్ తెచ్చింది. మరి ఈసారి ఎలాంటి సినిమాతో ముందుకొస్తారో చూడాలి!