హైదరాబాద్‌లో సేవ్‌టెంపుల్స్ చలన చిత్రోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పురాతన దేవాలయాలు నాడు, నేడు ఎలా వున్నాయి అనే అంశంతో ‘సేవ్ టెంపుల్స్’ పేరిట చిత్రీకరించిన డాక్యుమెంటరీలలో ఉత్తమమైనవాటిని ఎంపిక చేసి హైదరాబాద్‌లో నిర్వహించే అంతర్జాతీయ డాక్యుమెంటరీ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించనున్నారు. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్, సేవ్ టెంపుల్స్ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ డాక్యుమెంటరీ చలన చిత్రోత్సవం- 2016ను హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. సాంస్కృతిక ప్రచార సారధి డా. గజల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ ఫిలిం ఫెస్టివల్‌లో వంద సంవత్సరాలు పైబడిన దేవాలయాల విశిష్టత, వైభవం, నాటి ఉత్సవాలు, దేవాలయ మాన్యాలు, వర్తమానంలో ఆ దేవాలయ పరిస్థితులు ఎలా వున్నాయి అనే అంశంతో హృద్యంగా చిత్రీకరించిన డాక్యుమెంటరీలను ప్రదర్శిస్తారు. ఇందులో పాల్గొనదలచిన ఔత్సాహికులు తాము రూపొందించే డాక్యుమెంటరీలను కొన్ని పరిమితులకు లోబడి నిర్మించాలని ఆయన సూచించారు. డాక్యుమెంటరీ హృద్యంగా ఉండాలని, అది ఏ భాషలోనైనా నిర్మించవచ్చునని, ఇంగ్లీషు సబ్ టైటిల్స్ విధిగా వుండాలని ఆయన కోరారు. ప్రతి డాక్యుమెంటరీ నిడివి సరిగ్గా 10 నిమిషాలు మించకుండా వుండాలని, జాతీయ సమైక్యతను భంగపరిచే అంశాలు అందులో వుండరాదని ఆయన కోరారు. ప్రపంచవ్యాప్తంగా అతి ప్రాచీన దేవాలయాల వైభవాన్ని, నేడు ఆ దేవాలయాలు ఎదుర్కొనే సవాళ్ళను అందరికీ అవగాహన కలిగించే ఉద్దేశ్యంతో ఈ డాక్యుమెంటరీ చలన చిత్రోత్సవాన్ని నిర్వహిస్తున్నామని, విజేతలుగా నిలిచినవారికి జ్యూరీచే ఎంపిక చేయబడిన కొన్ని డాక్యుమెంటరీలను చలన చిత్రోత్సవంలో ప్రదర్శిస్తామని ఆయన వివరించారు. ఉత్తమ చిత్రానికి లక్ష రూపాయలు, ద్వితీయ చిత్రానికి 75 వేలు, తృతీయ చిత్రానికి 50 వేల నగదు బహుమతిని అందజేస్తామని, వీటితోపాటు ప్రోత్సాహ బహుమతులు మూడు ఉన్నాయని, ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందిస్తామని ఆయన తెలిపారు.