లవ్‌బాయ్స్‌తో లావణ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్యలక్ష్మి ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై పావని, పరమేష్ యోధా, సాంబ, కిరణ్ ప్రధాన తారాగణంగా రాజ్యలక్ష్మి.సి, నర్సింములు పటేల్ చట్టి రూపొందిస్తున్న చిత్రం ‘లావణ్య విత్ లవ్‌బాయ్స్’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. తుమ్మలపల్లి రామసత్యనారాయణ క్లాప్‌నివ్వగా చంద్రశేఖర్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ప్రేమ గొప్పతనాన్ని చాటిచెప్పే అందమైన సినిమాగా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నామని తెలిపారు. మంచి కథ కథనాలు కుదిరాయని, మాటలు, పాటలు హైలెట్‌గా వుంటాయని, ముగ్గురు కథానాయక, నాయికలపై ఓ పాటను ఇటీవల చిత్రీకరించామని ఆయన తెలిపారు. చిత్రానికి కెమెరా:తోట వి.రమణ, సంగీతం:యశోకృష్ణ, దర్శకత్వం:వడ్డేపల్లి కృష్ణ.