ప్రేమికుల తొలి పరిచయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకీ, లాస్య జంటగా పియుకె ప్రొడక్షన్స్ పతాకంపై ఎల్.రాధాకృష్ణ దర్శకత్వంలో దీపక్ కృష్ణ రూపొందించిన చిత్రం ‘తొలి పరిచయం’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో గురువారం ఉదయం ప్రసాద్ లాబ్‌లో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన హీరో నిఖిల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. సినిమాకు సంబంధించిన పోస్టర్లు, ట్రైలర్ క్యూరియాసిటీతో వున్నాయని, సినిమా కొంచెం బాగున్నా ఈ రోజుల్లో మంచి విజయం సాధిస్తోందని, అలా ఈ చిత్రం మంచి విజయం సాధించాలని ఆయన కోరుకున్నారు. తాగుబోతు పాత్రలో తాను నటించానని, సినిమా షూటింగ్ అంతా అందమైన లొకేషన్‌లలో చేశారని నటుడు ఛత్రపతి శేఖర్ తెలిపారు. నేటి యువత ఆలోచనలకు దర్పణంగా ఈ సినిమా సాగుతుందని, పాపికొండల్లో చిత్రీకరించిన సన్నివేశాలన్నీ హైలెట్‌గా వుంటాయని కథానాయకుడు వెంకీ తెలిపారు. రొటీన్‌కు భిన్నంగా ఈ సినిమా సంగీతం ప్రాధాన్యతతో సాగుతుందని, త్వరలోనే ఆడియో విడుదల జరుపుతామని నిర్మాత తెలిపారు. కార్యక్రమంలో సంగీత దర్శకుడు ఇంద్రగంటి, కథానాయిక లాస్య, కళహరిరెడ్డి, సినిమా యూనిట్ పాల్గొని విశేషాలు తెలిపారు. మురళీమోహన్, సుమన్, రాజీవ్ కనకాల, రఘుబాబు, కళ్లు అప్పారావు, ప్రీతినిగమ్, రాగిణి, మధుమణి, సాహితి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:ఇంద్రగంటి, ఎడిటింగ్:కృష్ణపుత్ర, కెమెరా:శరవణకుమార్.సి, కరుణాకర్, నిర్మాత:దీపక్ కృష్ణ, దర్శకత్వం:ఎల్.రాధాకృష్ణ.