3న గుంటూరోడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనోజ్, ప్రగ్యా జైస్వాల్ జంటగా క్లాప్ అండ్ విజిల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఎస్.కె.సత్య దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘గుంటూరోడు’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి వచ్చేనెల 3న విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత వరుణ్ అట్లూరి మాట్లాడుతూ- లవ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాను అనుకున్న సమయంలోనే పూర్తి చేశామని, ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్లకు, పాటలకు మంచి ఆదరణ లభిస్తోందని తెలిపారు. ఈ సినిమాను వచ్చే నెల 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుపుతున్నామని ఆయన అన్నారు. రాజేంద్రప్రసాద్, కోట శ్రీనివాసరావు, రావురమేష్, పృధ్వీ, సంపత్, ప్రవీణ్, సత్య, జెమిని సురేష్, కాశీ విశ్వనాధ్ నటించిన ఈ చిత్రానికి సంగీతం:శ్రీవసంత్, కెమెరా:సిద్ధార్థ రామస్వామి, ఎడిటింగ్:కార్తిక శ్రీనివాస్, పాటలు:రామజోగయ్య శాస్ర్తీ, భాస్కరభట్ల, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం:ఎస్.కె.సత్య.