ఎన్టీఆర్‌తో సింగం దర్శకుడు?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సింగం సీక్వెల్‌తో మంచి కమర్షియల్ విజయాలను అందుకున్నాడు దర్శకుడు హరి. లేటెస్టుగా ‘సింగం 3’ కూడా మంచి విజయాన్ని అందుకుంది. సూర్య హీరోగా నటించిన ఈ మూడు సినిమాల హిట్‌తో దర్శకుడు హరి తన నెక్స్ట్ సినిమాపై అప్పుడే దృష్టి పెట్టాడు. హరి తదుపరి సినిమా ఎన్టీఆర్‌తో చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. గతంలో కూడా ఆయన ఎన్టీఆర్‌తో సినిమా చేసేందుకు ప్రయత్నాలు సాగించినట్టు వార్తలు వచ్చాయి. అయితే లేటెస్టుగా సింగం 3 సక్సెస్‌మీట్ తరువాత హరి ఎన్టీఆర్‌ని కలిసినట్టు తెలుస్తోంది. మాస్ పల్స్ బాగా తెలిసిన హరి ఎన్టీఆర్‌తో సినిమా తీస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నాడని, మరి ఈ సినిమా గురించి ఎన్టీఆర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ బాబి దర్శకత్వంలో తన 27వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.