వారు గొప్పనటులు సైఫ్, షాహిద్‌లపై కంగన ప్రశంసలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండో ప్రపంచ యుద్ధం కథ నేపథ్యంతో నిర్మించిన ‘రంగూన్’లో సహ నటులు షాహిద్, సైఫ్‌లపై హీరోయిన్ కంగనా రనౌత్ ప్రశంసలు కురిపించింది. ఈ చిత్రంలో వారి నటన అద్భుతంగా ఉందని, వారు సహజనటులను, అలాంటి వారితో కలసి నటించడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆమె అంటోంది. ప్రస్తుతం ‘రంగూన్’ ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్న ఆమె సైఫ్, షాహిద్‌లతోపాటు దర్శకుడు విశాల్ భరద్వాజ్ ప్రతిభను కొనియాడింది. ‘ఓంకార’లో లంగ్డాగా సైఫ్, ‘హైదర్’లో షాహిద్‌ల నటనను గుర్తుచేస్తూ వారిని ఆకాశానికెత్తేసింది. ఎవరూ ఆలోచించని అంశాన్ని ఎంచుకోవడం, ధైర్యంగా సెల్యులాయిడ్ రూపం ఇవ్వడంలో దర్శకుడు విశాల్ భరద్వాజ్ ప్రత్యేకతను చాటాయన్న ఆమె అందులో తనకు కీలక పాత్ర ఇవ్వడం సంతోషం కలిగించిందని, ఇంతవరకు చేయని అద్భుతమైన అవకాశం వచ్చినట్టయిందని పేర్కొంది. సాజిద్ నదియానా నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండో ప్రపంచయుద్ధంలో సాహసోపేత చర్యలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన యుద్ధనారి మేరీ అనెవాన్స్ పాత్రలో కంగనారనౌత్ నటిస్తోంది.