కథ బాగుంటేనే చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సినిమా పరిశ్రమలో ఆర్.పి.పట్నాయక్ అంటే ఓ సంచలనం. ఆయన సంగీతం అందించిన చాలా సినిమాలు మ్యూజికల్ హిట్స్‌గా సంచలనం సృష్టించాయి. ఎన్నో చిత్రాలకు సంగీతంతో ప్రాణం పోసిన ఆర్.పి.పట్నాయక్ ఈమధ్య నటుడు, దర్శకుడిగా మారిన విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ తన సంగీతంతో ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయత్నాలు చేస్తున్నాడు. జాన్‌బాబు దర్శకత్వంలో రూపొందుతున్న ‘తొలికిరణం’ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు ఆర్.పి.పట్నాయక్. ఈ చిత్రం త్వరలో విడుదలవుతున్న సందర్భంగా ఆర్.పి.పట్నాయక్ చెప్పిన విశేషాలు..
మంచి కథ
ఈ చిత్రానికి సంగీతం అందించడానికి కారణం, మంచి కథ కుదిరింది. ఏసుక్రీస్తుపై చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఇందులో విభిన్న కోణంలో ఆయన చరిత్రను ఆవిష్కరిస్తున్నారు. ముఖ్యంగా సంగీతానికి మంచి స్కోప్ వుండడంతో ఈ సినిమాకు సంగీతం అందించా. ఈ చిత్రంలో ఆరు పాటలుంటాయి. తప్పకుండా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఈ పాటలు వచ్చాయి.
నటన గురించి
నటుడిగా పూర్తి స్థాయిలో నటించాలని అనుకోలేదు. అందుకే బ్రోకర్ తరువాత చాలాకాలానికి మరో సినిమా విడుదలైంది. భిన్నమైన కథలతో వచ్చే చిత్రాలైతేనే చేయాలని అనుకున్నాను. ఒకరు చేసింది ఖచ్చితంగా నేను చేయను. నాకు నచ్చితేనే చేస్తా.
మ్యూజికల్ హిట్స్
సంగీత దర్శకుడిగా ఉన్న నేను దర్శకుడిగా మారి సినిమాలు చేస్తున్నాను. అయితే, మ్యూజికల్ హిట్స్ వున్న కథలతో సినిమాలు చేయచ్చు కానీ ఆ ఆలోచన నాకు రాదు. ఎందుకంటే భిన్నమైన కథలనే తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నాను కాబట్టి ఆ ప్రయత్నం చేయలేదు. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాను. అందులో ఒకటి మ్యూజికల్ లవ్‌స్టోరీతో వుంటుంది. ఖచ్చితంగా ఈ సినిమా మ్యూజికల్ హిట్‌గా నిలుస్తుంది. దాంతోపాటు మరో సినిమా చేస్తున్నా.

-యు