షో అదిరింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాలీవుడ్‌లో బాలీవుడ్ హీరోయిన్ల హవా మొదలైంది. ఇప్పటికే ‘క్వాంటికొ’ సీరియల్‌తో అక్కడి ప్రేక్షకుల మనసు దోచిన ప్రియాంకచోప్రా ‘బేవాచ్’ చిత్రంలో నటిస్తోంది. ఇక దీపిక పదుకొనే ‘ట్రిపుల్ ఎక్స్’ సినిమాతో అరంగేట్రం చేసింది. అయితే అవకాశం దొరకబుచ్చుకునేందుకు వచ్చిన ఏ అవకాశాన్ని వీరిద్దరూ వదులుకోవడం లేదు. ప్రచార కార్యక్రమాలు, టీవీ షోలు, ఫ్యాషన్ షోలకు విధిగా హాజరై తమ అందచందాలతో ఆకట్టుకుంటున్నారు. రెండు రోజుల క్రితం న్యూయార్క్‌లో జరిగిన షోలో ఇద్దరూ ఓ మెరుపు మెరిసారు. ప్రబద్ గురుంగ్ రూపొందించిన దుస్తుల్లో ప్రియాంక మెరిసిపోతే మైఖేల్ కొరాస్ రూపొందించిన దుస్తుల్లో దీపిక హొయలుపోయింది. పలువురు హాలీవుడ్ తారలు పాల్గొన్న ఈ ఫ్యాషన్ షోలలో దీపిక, ప్రియాంక ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.