వేసవిలో ఉంగరాల రాంబాబు నటుడు సునీల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సునీల్, మియా జార్జ్ జంటగా కె.క్రాంతిమాధవ్ దర్శకత్వంలో యునైటెడ్ కిరీటి మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి నిర్మిస్తున్న ‘ఉంగరాల రాంబాబు’ చిత్రం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో సాంగ్ చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో హీరో సునీల్ మాట్లాడుతూ- ‘ఉంగరాల రాంబాబు టైటిల్ వింటే ఎంత ఫన్నీగా వుందో సినిమా మొత్తం అలాగే వుంటుంది. ఒకప్పుడు చలం నటించిన సంబరాల రాంబాబు టైటిల్ బాగుందని, ఈ టైటిల్ కూడా అలాంటి ఫీల్ కలుగుతుందని నా స్నేహితులు కొంతమంది చెప్పారు. క్రాంతి మాధవ్ లాంటి టాలెంటెడ్ దర్శకుడితో పనిచేయడం ఆనందంగా వుంది. అప్పట్లో రాజేంద్రప్రసాద్ చేసినటువంటి తరహాలో నా పాత్ర ఉంటుంది. పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ ఇటీవలే విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. త్వరలోనే షూటింగ్ పూర్తిచేసి సమ్మర్‌కు విడుదల చేస్తాం. ఇందులో తనది జాతకాలు నమ్మే పాత్ర. చిన్నపిల్లాడి మనస్తత్వం వుండే వ్యక్తి. ఈ సినిమాకోసం ఐదు కిలోల బరువు పెరిగా’ అని అన్నారు. దర్శకుడు క్రాంతి మాధవ్ మాట్లాడుతూ-‘ప్రస్తుతం షూటింగ్ పూర్తయింది. ఇంట్రడక్షన్ సాంగ్ చిత్రీకరిస్తున్నాం. త్వరలోనే మిగతా కార్యక్రమాలన్నీ పూర్తిచేసి సమ్మర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. కుటుంబం అంతా కలిసి చూసే చిత్రంగా ఉంటుంది. ముఖ్యంగా సునీల్ కమెడియన్‌గా అప్పట్లో ఎలాంటి ఇమేజ్ తెచ్చుకున్నాడో, ఈ సినిమాలో కూడా అలాగే కన్పిస్తాడు. మళ్లీ మళ్లీ ఇది రానిరోజు సినిమా తరువాత పూర్తి స్థాయి కామెడీ సినిమా చేయాలని రాసుకున్న కథ ఇది. అమాయకమైన కుర్రాడు ఎలా ఈ ప్రపంచంలో నిలబడ్డాడు అనే కథతో ఉంటుంది’ అని అన్నారు. త్వరలోనే సినిమాలోని పాటలను విడుదల చేస్తామని నిర్మాత పరుచూరి ప్రసాద్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం:జీబ్రాన్, కెమెరా:సర్వేష్ మురారి, శ్యామ్ కె నాయుడు, ఎడిటింగ్:కోటగిరి వెంకటేశ్వరరావు, మాటలు:చంద్రమోహన్ చింతాడ, నిర్మాత:పరుచూరి కిరీటి, దర్శకత్వం:క్రాంతిమాధవ్.