ముహూర్తం కుదిరింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ తొమ్మిదేళ్ల తరువాత నటించిన ‘ఖైదీ నెం 150’వ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై అనూహ్య విజయాన్ని స్వంతం చేసుకుని ఏకంగా బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది. 100 కోట్ల మార్కెట్‌ని క్రాస్ చేసి మెగాస్టార్ హవా తగ్గలేదని రుజువుచేసింది. ఇక ఈ సినిమా ఇచ్చిన ఊపుతో మరిన్ని చిత్రాలు చేయడానికి జోరు పెంచాడు చిరంజీవి. ఇప్పటికే ఆయన 151వ చిత్రంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో సినిమా చేయడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌వర్క్ జోరుగా జరుగుతోంది. దాంతోపాటు ప్రీ ప్రొడక్షన్ పనులుకూడా మొదలయ్యాయి. మెగా తనయుడు రామ్‌చరణ్ నిర్మించే ఈ చిత్రానికి ముహూర్త కుదిరింది. ఈ చిత్రాన్ని మేలో ప్రారంభిస్తున్నట్టు తెలిసింది. ఈ ప్రారంభోత్సవం మెగా అభిమానుల సమక్షంలో గ్రాండ్‌గా జరపనున్నాయి. నిజానికి ‘ఖైదీ నెం 150’ ఘన విజయం సాధించడంతో ఆ సినిమా విజయోత్సవాన్ని మెగాఫ్యాన్స్‌మధ్య జరుపుకోవాలని అనుకున్నారు. కానీ అది కుదరకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. అందుకే ఈ సినిమా ఓపెనింగ్ వారి సమక్షంలో భారీ స్థాయిలో జరపనున్నట్టు తెలిసింది. జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది