ఇద్దరు హీరోయిన్లతో రోగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతోన్న మరో భిన్నమైన సినిమా రోగ్. ఇషాన్‌ను హీరోగా పరిచయం చేస్తూ జయాదిత్య సమర్పణలో తన్వి ఫిలింస్ పతాకంపై సి.ఆర్.మనోహర్, సి.ఆర్.గోపి నిర్మిస్తున్న చిత్రం ‘రోగ్’. మరో చంటిగాడి ప్రేమకథ అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే టాలీవుడ్‌కు అనుష్క, ఆసిన్, హన్సిక, రక్షిత, దిశాపటాని, కంగనా రనౌత్, శియా గౌతమ్, నేహాశర్మ, సమీక్ష, ఆయేషా టకియా, ఆదాశర్మ వంటి గ్లామర్ హీరోయిన్లను తెలుగు తెరకు పరిచయం చేసిన పూరి జగన్నాధ్ ఈ సినిమాతో మరో హీరోయిన్ ఏంజెలాను పరిచయం చేస్తున్నారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు వుంటారని, మన్నారా చోప్రాతోపాటు ఏంజెలా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు గ్లామర్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే డిఫరెంట్ ప్రమోషన్‌తో సినిమాపై భారీ ఆసక్తిని రేకెత్తిస్తున్న పూరీ ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అవుతున్న ఏంజెలా స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంటుందేమో చూడాలి!