భిన్నమైన పాత్రలో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లామర్ భామ తమన్నాకు గత ఏడాది అంతా కలిసి రాలేదు. చేసిన సినిమాలు పెద్దగా కమర్షియల్ విజయాలు సాధించకపోవడం, ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘అభినేత్రి’ భారీ పరాజయం పాలవడంతో ఈమధ్య అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం తమిళంలో రెండు క్రేజీ చిత్రాల్లో నటిస్తున్న తమన్నాకు తెలుగులో కూడా ఓ మంచి అవకాశం దక్కింది. ముఖ్యంగా తమిళంలో విలక్షణ నటుడు విక్రమ్ హీరోగా గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న ధృవనక్షత్రం చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన విజయ్‌చందర్ దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్ అయ్యాడు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా అవకాశం కొట్టేసింది తమన్నా. గ్లామర్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న తమన్న ఈ చిత్రంలో భిన్నమైన పాత్రలో కన్పిస్తుందట. ఆ పాత్ర ఓ స్లమ్‌లో నివసించే యువతిగా పూర్తి స్థాయి గా అదే తరహాలో కన్పిస్తుందట. తన కెరీర్‌లో ఇదో భిన్నమైన పాత్ర అని చెబుతోన్న తమన్నా, గ్లామర్‌తోపాటు నటనకు స్కోప్‌వున్న పాత్రలు వస్తే చేయాలని తెగ ఆశపడుతోంది. మరి ఈ పాత్రతో ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటుందో చూడాలి!