24న యమన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటుడు విజయ్ ఆంటోని. ఆయన తదుపరి చిత్రంగా రాజకీయ నేపథ్యంలో రూపొందిన చిత్రం యమన్. లైకా ప్రొడక్షన్స్, ద్వారకా క్రియేషన్స్ పతాకాలపై జీవశంకర్ దర్శకత్వంలో మిరియాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈనెల 24న విడుదలవుతున్న సందర్భంగా నిర్మాత వివరాలు తెలియజేస్తూ- ‘‘బిచ్చగాడు’ తరువాత విజయ్ ఆంటోని హీరోగా నటించిన మరో మంచి చిత్రం ‘యమన్’ అని, ఇప్పటివరకూ విజయ్ చేసిన సినిమాల్లో ఇదే భిన్నమైన సినిమా అని, పూర్తిస్థాయి పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిన ఈ చిత్రంలో రొమాంటిక్ సన్నివేశాలు, రొమాంటిక్ సాంగ్స్ ఉండవని అన్నారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రంలోని పాటలు ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయని, త్వరలోనే మిగతా కార్యక్రమాలన్నీ పూర్తిచేసి మహాశివరాత్రి కానుకగా ఈనెల 24న విడుదల చేస్తున్నామని అన్నారు. హీరో విజయ్ ఆం టోని మాట్లాడుతూ- ‘బిచ్చగాడు సినిమాకు కథ ఎలా ప్లస్ అయిందో, ఈ సినిమాకు కూడా అలాంటి కథ కుదిరింది. జీవశంకర్ నాతో నకిలీ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ తరువాత ఈ కథతో మళ్లీ మీ ముందుకు వస్తున్నాం. ఈ సినిమాకి సంగీతాన్ని నేనే అందించాను. పాటలు కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకున్నాయి. సినిమా కూడా మంచి హిట్ అవుతుందన్న నమ్మకముంది’ అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:విజయ్ ఆంటోని, ఎడిటింగ్: వీరసెంథిల్ రాజ్, మాటలు: భాషాశ్రీ, నిర్మాతలు:మిరియాల రవీందర్‌రెడ్డి, దర్శకత్వం:జీవశంకర్.