వ్యాపారం చేసే నటుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవదీప్, కావ్య జంటగా లెజెండ్ పిక్చర్స్ పతాకంపై ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ దర్శకత్వం లో రమేష్‌బాబు కొప్పుల రూపొందిస్తున్న సస్పెన్స్ యాక్షన్ ధ్రిల్లర్ చిత్రం నటుడు. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా హీరో నవదీప్ మాట్లాడుతూ- ఈ కథ చాలా థ్రిల్లింగ్‌గా వుంటుందని, తనను నటుడిగా మరో మెట్టు ఎక్కించే విధంగా రూపొందిందని తెలిపారు. తెలుగు ప్రేక్షకులకు నచ్చే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ వున్న ఈ సినిమా తప్పక హిట్ అవుతుందని ఆయన అన్నారు. మానవ సంబంధాల నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ సినిమా కథనం తెరపై చెప్పిన విధానంలో కొత్తదనం వుంటుందని, ప్రేక్షకులకు థ్రిల్ కలిగిస్తుందని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత రమేష్‌బాబు అన్నారు. ప్రేమలోని ఒక సరికొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ రూపొందించిన ఈ చిత్రంలో ‘ప్రేమలను అమ్మడం, కొనడం’ అనే కొత్త కానె్సప్టు వుంటుందని, అనుకున్న బడ్జెట్‌లోనే సినిమా పూర్తిచేశామని, తప్పక విజయవంతం అవుతుందన్న నమ్మకం వుందని దర్శకుడు ప్రసాద్ తెలిపారు. నాగినీడు, సూర్య, సత్య, ఆశీష్ గాంధీ, జియా తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:వాసు, సంగీతం:జయసూర్య, ఎడిటింగ్:నాగిరెడ్డి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్.