తెలుగు సినిమా మారుతోంది..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సినిమాల్లో కొత్తదనం ఉండదు.. ఫక్తు మాస్ మసాలా అంశాలతో హీరోయిజాన్ని ప్రదర్శించే ఫార్ములాతో కమర్షియల్ సినిమాలే చేస్తారు.. భిన్నమైన సినిమాలు రావాలంటే అది తమిళ పరిశ్రమలోనే సాధ్యం.. నిజమే- ఏ తెలుగు సినిమా తీసుకున్నా హీరో.. అతని ఫ్లాష్‌బ్యాక్.. తన కుటుంబానికో.. తన తనవాళ్లకో అన్యాయం చేసిన విలన్‌ను అంతమొందించడం.. విలన్ కూతురో.. లేక హీరోకి మరదలో హీరో వెంట పడుతూ.. ప్రేమిస్తున్నానని నానాహంగామా చేసి గ్లామర్‌తో అదరగొట్టి ప్రేక్షకులను కాస్త మత్తెక్కించడం.. ఫైనల్‌గా హీరో వందమందిని కొట్టేసి విలన్‌ని మట్టుబెట్టడంతో సినిమా ముగుస్తుంది. దాదాపుగా అన్ని సినిమాలు అటు తిప్పి, ఇటు తిప్పి ఈ మూస ఫార్ములాలో సినిమాలు వచ్చిన విషయం ఏ తెలుగు ప్రేక్షకుణ్ణి అడిగినా అవుననే అంటాడు.
తెలుగులో భిన్నమైన సినిమాలు రాలేదా? శంకరాభరణం లాంటి గొప్ప సినిమాలు వచ్చాయి.. గొప్ప సినిమాల్లో సక్సెస్ రేట్ కూడా తక్కువే? ఇది అక్షరాలా నిజం.. ఎందుకంటే తెలుగు సినిమాలు ప్రేక్షకుడిని అలా మార్చేశాయి.. ఆ ఫార్ములా దాటి సినిమాలు చేస్తే దాన్ని చూసే సాహసం, చూసి జీర్ణించుకునే సాహసం ప్రేక్షకులు చేయడం లేదు. అందుకే కమర్షియల్ సినిమాలు మాత్రమే ఎక్కువ సక్సెస్ కావడంతో అందరూ అదే దారిలో ఫాలో అయ్యారు. ఇక సీనియర్ హీరోల మాట పక్కనపెడితే ఇప్పుడు వస్తున్న యువ హీరోలు కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతూ.. హిట్ కొట్టడానికి దూరంగానే ఉంటున్నారు. కానీ గత ఏడాదినుండి తెలుగు సినిమా పయనం మారింది. కమర్షియల్ సినిమాలనే కాకుండా భిన్నమైన సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు ముందుకు రావడంతో ఇప్పుడు కొత్త కొత్త సినిమాలు తెలుగు ప్రేక్షకులను పలకరిస్తూ.. భిన్నమైన సినిమాలు చేయగలమని ప్రూవ్ చేసుకుంటున్నారు.
తెలుగు సినిమా ఈ ఏడాది కొత్త పుంతలు తొక్కింది. అగ్ర కథానాయకుల చిత్రాలకంటే కొత్తగా పరిచయమైన దర్శకులు, నటులు ఆదరణ పొందారు. అగ్రకథానాయకుల చిత్రాల్లో కూడా సీరియస్ కంటే ఎంటర్‌టైన్‌మెంట్‌కే పెద్దపీట వేశారు. రొటీన్ చిత్రాలను ప్రేక్షకులు గండికొట్టారు. దాంతో కొత్త జోనర్ అంటూ.. థ్రిల్లింగ్ చిత్రాలు వచ్చాయి. దెయ్యం కానె్సప్టులు ముందుకు వచ్చాయి. ఈ ఏడాది కథానాయకుల సక్సెస్‌లు కొంతమేరకే దక్కాయి. రొటీన్ సినిమాల్లోలాగా హీరో ఒక్కడే ఒక్కో దెబ్బకు వందమంది ఎగిరిపడే సన్నివేశాలు పోయాయి. నేచురల్‌గా వుండే యాక్షన్ చిత్రాలను కథానాయకులు పెద్దపీట వేశారు. కథలకు బోలెడంత హంగామాలతో ముందుకు వచ్చారు. పనిలో పనిగా కథల్లో కొత్తదనం దొరక్క పలువురు పొరుగు భాషల్లో సిద్ధమైన కథలు తెరకెక్కించారు. దాంతో కొన్నిసార్లు కొత్త కథలతో థ్రిల్లర్ చేస్తే సేఫ్‌గా భావిస్తున్నారు. మొదట్లో చిన్న సినిమాలకే పరిమితమైన థ్రిల్లర్ కానె్సప్టులు స్టార్ కథానాయకుల స్థాయికి వచ్చేశాయి.
ఈ విషయంలో మొదటి అడుగు వేసిన హీరోగా మహేష్‌ని చెప్పుకోవాలి. దర్శకుడు సుకుమార్ మహేష్‌బాబుతో ‘వన్ నేనొక్కడినే’ చిత్రం చేశాడు. ఆ సినిమాతో మహేష్‌కి కమర్షియల్ విజయం దక్కకపోయినా కూడా మంచి మార్కులు కొట్టేశాడు. ఆ చిత్రం నచ్చి ఎన్‌టిఆర్ సుకుమార్ డైరెక్షన్‌లో చేయడానికి ముందుకువచ్చాడు. దాంతో ‘నాన్నకు ప్రేమతో’ చేశాడు. సెంటిమెంట్ డ్రామాతో గట్టెక్కింది. రొటీన్ సినిమాలకు భిన్నంగా వున్న ఈ సినిమా అటు ప్రేక్షకులకు నచ్చడంతో మంచి హిట్ అందించి ఎన్టీఆర్‌ను 50 కోట్ల హీరోగా నిలబెట్టిందా చిత్రం. ఆ తర్వాత మోహన్‌లాల్ ప్రధాన పాత్రతో ‘జనతా గ్యారేజ్’ అంటూ మరో భిన్నమైన సినిమా చేసి ఆకట్టుకున్నాడు ఎన్టీఆర్. ఇక వెంకటేష్ కూడా కాస్త కొత్తగా ప్లాన్ చేసి ‘బాబు బంగారం’ అనే సినిమాతో ముందుకొచ్చాడు. మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జస్ట్ ఓకె అనిపించింది. దాంతో ‘గురు’తో విభిన్నమైన సబ్జెక్టుతో సినిమా చేస్తున్నాడు. బాక్సింగ్ కోచ్‌గా కనిపిస్తున్నాడు వెంకటేష్. ఇక పక్కా కమర్షియల్ సినిమా అయిన బ్రూస్‌లీ తర్వాత రామ్‌చరణ్ ఎలాంటి సినిమా చేస్తాడో అన్న సందేహంలో ఉండగా కాస్త సేఫ్ సినిమా చేయాలని తమిళంలో సూపర్‌హిట్ అయిన ‘తని ఒరువన్’ సినిమాను రీమేక్ చేశాడు. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించిన ఈ ధృవ సినిమా మంచి విజయాన్ని అందుకుని, ముఖ్యంగా రామ్‌చరణ్‌ని కొత్తగా చూపించింది. ఇక నందమూరి బాలకృష్ణ కూడా చారిత్రక సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణితో మరో భిన్నమైన సినిమా చేసి ఆకట్టుకున్నాడు. ఇక మెగాస్టార్‌గా తెలుగు తెరపై తిరుగులేని ఇమేజ్‌ని సొంతం చేసుకున్న చిరంజీవి తొమ్మిదేళ్ల తరువాత రీ ఎంట్రీ ఇస్తూ.. ‘కత్తి’ అనే తమిళ సినిమా రీమేక్‌తో వచ్చి వంద కోట్ల మార్కెట్‌ను కొల్లగొట్టాడు. లేటెస్టుగా రానా ఇంతవరకు ఇండియన్ స్క్రీన్‌పై రానటువంటి సబ్‌మెరైన్ కథతో సినిమా చేసి మంచి మార్కులే కొట్టేశాడు. మొత్తానికి స్టార్ హీర్లో వచ్చిన ఈ మార్పుతో తెలుగు ప్రేక్షకులకు భిన్నమైన సినిమాలు అందుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

- శ్రీ