డోర రహస్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నయనతార ప్రధాన పాత్రలో సుర ఎంటర్‌టైన్‌మెంట్స్ మీడియా పతాకంపై మల్కాపురం శివకుమార్ తెలుగులో అందిస్తున్న చిత్రం ‘డోర’. ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు, తమిళ భాషల షూటింగ్ పూర్తిచేశారు. దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం మహిళా ప్రధాన కథనంతో ప్రయోగాత్మకంగా రూపొందిందని, అందులో నయనతార చేసిన పాత్ర సరికొత్తగా ఉంటుందని నిర్మాత శివకుమార్ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. సినిమా షూటింగ్ పూర్తయిన ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను, ఆడియోను త్వరలో విడుదల చేస్తామని తెలిపారు. విభిన్న కథాకథనాలతో తెరకెక్కుతున్న ఈ హారర్ చిత్రంలో ఓ యువతి జీవితంలో చోటుచేసుకున్న అనూహ్య సంఘటనలు ఎలా ఉన్నాయి అనే కథనం ఉంటుందని తెలిపారు. డోర అనే పేరు వెనుక ఉన్న రహస్యం ఏమిటి? అన్న అంశంతో సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకు ప్రతి సన్నివేశం థ్రిల్ కలిగించేలా సాగుతుందని, గతంలో వచ్చిన హారర్ చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ సినిమాపై తమిళనాడులో అంచనాలు భారీగా ఉన్నాయని, తెలుగులో కూడా ఆడియో విడుదలయ్యాక పెరుగుతాయని, ఈనెలలోనే టీజర్‌ను, ఆడియోను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: దినేష్, సంగీతం: వివేక్, నిర్మాత: మల్కాపురం శివకుమార్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దాస్.