సినిమాయే జీవితం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందము, కాస్త నటించే శక్తి ఉంటే సినిమాలే చేయక్కర్లేదు. బోలెడు అవకాశాలు మనకోసం ఎదురుచూస్తున్నాయి. వాటిని ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో తెలిసిన వాళ్లకి ఎలాంటి ఢోకా లేదని, సినిమాలే టార్గెట్ అని అనుకుంటే ఇబ్బందులు పడతామని చెప్పుకొచ్చింది నేహాధూపియా. హిరోయిన్‌గా బాలీవుడ్‌లో పాపులారిటీ సంపాదించాలని ప్రయత్నించిన నేహాధూపియాకి అవకాశాలు తలుపుతట్టలేదు. అందుకే తాను ఎప్పుడూ ఖాళీగా లేనని, అనేక రకాల పనులతో బిజీగా ఉన్నానని చెబుతోంది. నటులైనంత మాత్రాన కేవలం కెమెరాముందే డ్యూటీ చేయాల్సిన అవసరం లేదని, ఫుట్‌బాల్, క్రికెట్ జట్లను సొంతం చేసుకొని సంపాదించవచ్చని, అదికాకపోతే వ్యాపారాలు చేసుకోవచ్చని, సినిమాలు లేకపోయినా యాడ్స్‌లో నటిస్తూ హాయిగా ఉండొచ్చని చెబుతోంది. ఏది ఏమైనా మనకోసం మంచి అవకాశాలు వస్తాయి అన్న పాజిటివ్ థింకింగే మనకు బలాన్నిస్తుందని చెబుతోంది. నావరకు నాకు ఆసక్తికరమైన పాత్రలే వచ్చినా నచ్చక వదిలేశానని, అద్భుతమైన చిత్రాల్లో నటించాలన్న కోరిక ఉన్నా కొన్ని పాత్రలు తనకు సూట్ కావని, అందుకే అవకాశాలకోసం వెంపర్లాడకుండా నా వ్యాపారాలు నేను చేసుకుంటున్నానని చెప్పుకొచ్చింది నేహాధూపియా.!