విన్నర్ హిట్ ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయిధరమ్‌తేజ్ హీరోగా బేబి భవ్య సమర్పణలో లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మధు నిర్మించిన చిత్రం ‘విన్నర్’. మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమా ఫిబ్రవరి 24న విడుదలవుతుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత పివిపి మాట్లాడుతూ-‘‘2017 చాలా సక్సెస్‌ఫుల్ ఇయర్‌గా ఖైదీ నంబర్ 150తో స్టార్ట్ అయ్యింది. గౌతమిపుత్ర శాతకర్ణి, శతమానం భవతి ఇలా సక్సెస్‌ఫుల్ చిత్రాలతో ముందుకు సాగుతుంది. ఇప్పుడు విన్నర్ సినిమా త్వరలోనే రానుంది. ఈ ఏడాది విన్నర్ బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలుస్తుందని భావిస్తున్నా. తేజు, రకుల్‌లకు ఈ సినిమా మరో సక్సెస్ అవుతుంది. ‘బలుపు’ టీం ఈ సినిమాకు వర్క్‌చేసింది. ‘బలుపు’కంటే పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. నిర్మాతలకు ఈ సినిమా పెద్ద హిట్‌కావాలి’ అన్నారు. సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ- ‘నిర్మాతలు మధు, బుజ్జి ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్స్. డైరెక్టర్ గోపీచంద్ మలినేని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలవాలని కోరుకుంటున్నాను. ఎనర్జీ అంటే నాకు బన్ని తర్వాత తేజునే గుర్తుకువస్తాడు. ఈ చిత్రంతో డెఫినెట్‌గా తేజు టాప్ పొజిషన్‌లోకి వెళతాడు. థమన్ బ్లాక్‌బస్టర్ మ్యూజిక్ ఇచ్చాడు. మూవీ ‘రేసుగుర్రం’ కంటే పెద్ద హిట్‌కావాలవని కోరుకుంటున్నాను’ అన్నారు.
ఎస్.ఎస్.్థమన్ మాట్లాడుతూ- ‘డైరెక్టర్ గోపీచంద్ నా లైఫ్‌లో ఒక బాడీగార్డ్‌లా నా వెనుక నిలబడ్డాడు. ‘బలుపు’, పండగచేస్కో, ఇప్పుడు ‘విన్నర్’ సినిమాలను చేశాను. సినిమా పెద్ద హిట్ అవుతుంది. సాయిధరమ్‌తేజ్‌కు మ్యూజిక్ చేసేటప్పుడు చిరంజీవి, పవన్‌కల్యాణ్, స్టైలిష్ స్టార్ సహా అందరూ గుర్తుకువస్తారు. అందుకే తనకు మంచి మ్యూజిక్ ఇవ్వడానికే ప్రయత్నిస్తాను. ఇప్పుడు తేజుతో ‘జవాన్’ సినిమా చేస్తున్నాను. ‘రేసుగుర్రం’తర్వాత బుజ్జిగారి బ్యానర్‌లో వర్క్‌చేశాను. అనూప్, జగపతిబాబు, రకుల్ సహా అందరూ అద్భుతంగా చేశారు’ అన్నారు.
గోపీచంద్ మలినేని మాట్లాడుతూ- ‘ఈ సినిమాకు తేజుతో వర్క్ చేస్తున్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌ని డైరెక్ట్ చేసిన ఫీలింగ్ కలిగింది. తేజు డైరెక్టర్స్ ఆర్టిస్ట్. ఈ సినిమా పెద్ద రేంజ్ మూవీ అవుతుంది. రిస్క్ చేసి యాక్షన్స్ సీన్స్ చేశాడు. ఈ సినిమా తర్వాత కమర్షియల్‌గా నెక్స్ట్ లెవల్‌కు వెళతాడు. జగపతిబాబు తండ్రిగా చాలా ముఖ్యమైన రోల్ చేశారు. థమన్, గౌతంరాజు, ఎ.ఎస్.ప్రకాష్, అబ్బూరి రవి, రామజోగయ్యశాస్ర్తీ వంటి టెక్నిషియన్స్ ఇచ్చారు. వెలిగొండ అద్భుతమైన కథను ఇచ్చారు. థమన్‌తో నేను చేసిన మూవీలన్నీ మ్యూజికల్‌గా పెద్ద హిట్ అయ్యాయి. ఈ సినిమా పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చాయి. రకుల్‌తో నేను చేసిన రెండో సినిమా. తను మంచి డెడికేషన్ ఉన్న హీరోయిన్. అనుష్క తర్వాత అంత హార్డ్‌వర్కర్ రకుల్. సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ- ‘కథ వినగానే చాలా ఖర్చుతో కూడుకున్న సినిమా అని అన్పించింది. నిర్మాతలు మధు, బుజ్జి, నాపైన అంత బడ్జెట్ పెడతారా.. అంత అవసరమా.. అని కన్‌ప్యూజ్ అయ్యేవాడిని. కథకు ఎంత ఖర్చు పెట్టాలో ఆలోచించారే కానీ.. మరేం ఆలోచించలేదు. నిర్మాతల గట్స్‌కు హ్యాట్సాఫ్. మహేష్‌బాబు, సమంత, అనిరుధ్, రవితేజ, ఎ.ఆర్.మురుగదాస్ అడగ్గానే సాంగ్స్ రిలీజ్ చేసి ఎంతగానో సపోర్ట్ చేశారు’ అని అన్నారు.