బాలీవుడ్‌లోకి ప్రస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యంగ్ హీరో శర్వానంద్ కెరీర్‌లో, తెలుగు సినీ పరిశ్రమలో ఒక క్లాసిక్‌గా నిలిచిపోయిన చిత్రం ‘ప్రస్థానం’. 2010లో విడుదలైన ఈ ఫ్యామిలీ పొలిటికల్ డ్రామా మంచి విజయాన్ని సాధించి పలు అవార్డులను కొల్లగొట్టింది. ఈ చిత్ర దర్శకుడు దేవాకట్ట పలు సందర్భాల్లో ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తానని, సమయంకోసం ఎదురుచూస్తున్నానని అన్నారు. ఇప్పుడు ఆ సమయం వచ్చినట్టే కనిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని హిందీలో స్టార్ హీరో సంజయ్‌దత్ హీరోగా రీమేక్ చేయనున్నారట. తెలుగు చిత్రాన్ని చూసిన సంజయ్‌దత్ బాగా ఇంప్రెస్ అయినట్టు, దేవాకట్ట కూడా రీమేక్‌కు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. అంతేగాక స్వయంగా ఆయనే సినిమాను నిర్మిస్తారని కూడా అంటున్నారు.