అదేదారిలో కాటమరాయుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవన్‌కళ్యాణ్ నటిస్తున్న ‘కాటమరాయుడు’ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ మార్చి నెలాఖరులో విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియో వేడుక నిర్వహించడం లేదు. ఒక్కో పాటను ఆన్‌లైన్‌లో విడుదల చేసి గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తారని తెలుస్తోంది. గతంలో అల్లు అర్జున్ ‘సరైనోడు’, రామ్‌చరణ్ ‘్ధృవ’, చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాలు ఆడియో వేడుక నిర్వహించకుండా ప్రీరిలీజ్ ఈవెంట్ చేశాయి. అలా చేసిన ఆ చిత్రాలన్నీ ఘన విజయం సొంతం చేసుకోవడంతో మెగా ఫ్యామిలీకి ప్రీ రిలీజ్ ఈవెంట్ సెంటిమెంట్‌గా మారిపోయింది. ధరమ్‌తేజ్ తన ‘విన్నర్’ చిత్రానికి కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి విడుదలకు సిద్ధమయ్యారు. అందుకే పవన్ చిత్రానికి కూడా ఇలానే చేయాలనుకుంటున్నారట. అయితే ఈ విషయమై ఎలాంటి అధికారిక సమాచారం అందలేదు. ‘గోపాల గోపాల’ ఫేమ్ డాలి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం తమిళ ‘వీరమ్’ సినిమాకి రీమేక్‌గా రూపొందుతోంది. శ్రుతిహాసన్ హీరోయిన్.