అక్షయ్‌పాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్రరంగంలో బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల వసూలు చేస్తే అది ఓ రికార్డు. ఇటీవలి కాలంలో ఈ మార్క్ దాటిన సినిమాలు ఎక్కువగానే ఉన్నా అది నలుగురైదుగురు హీరోలకే ఆ ఘనత దక్కుతోంది. ముఖ్యంగా ఖాన్ త్రయంగా చెప్పుకునే సల్మాన్‌ఖాన్, అమీర్‌ఖాన్, షారుక్‌ఖాన్ మొదటివరసలో ఉన్నారు. హృతిక్‌రోషన్ వీరితో చెప్పుకోదగ్గ పోటీ ఇస్తున్నప్పటికీ అక్షయ్‌కుమార్, ఖాన్ త్రయంతో ఎప్పటికప్పుడు పోటీపడుతూనే ఉన్నాడు. నువ్వొకటైతే నేనొకటి అన్న తీరులో షారుక్‌తో ఎప్పటికప్పుడు పోటీపడుతూ వస్తున్నాడు. 2017లో తాజాగా అతడు నటించిన ‘జానీ ఎల్‌ఎల్‌బి2’ చిత్రం మొదటి వారంలోనే వంద కోట్ల మార్క్‌ను దాటేసింది. సినీమార్కెట్ వ్యవహారాలను పరిశీలించే తరణ్ ఆదర్శ్ ఈ లెక్కలు తేల్చాడు. ఈ సినిమాతో అక్షయ్‌కుమార్ నటించిన ఏడు సినిమాలు వందకోట్ల మైలురాయి దాటాయి. సరిగ్గా షారుక్ నటించిన ఏడు సినిమాలు ఆ ఘనత దక్కించుకున్నాయి. షారుక్ తాజాగా నటించిన ‘రాయిస్’ విడుదలైన తొలి పదకొండు రోజుల్లోనే వందకోట్ల కలెక్షన్లు సాధించింది.
అక్షయ్‌కుమార్ దాదాపు వంద సినిమాల్లో నటించారు. వాటిలో చాలా హిట్‌లు ఉన్నాయి. వందకోట్లకు పైగా వసూళ్లు చేసిన సినిమాలు ఇప్పటి వరకూ ఏడున్నాయి.
1.రౌడీరాథోడ్ : హిందీలో రీమేక్ సినిమా ఇది. సోనాక్షిసిన్హా హీరోయిన్‌గా నటించింది. ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందింది. 130 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో అక్షయ్‌కుమార్ నటించారు. డబుల్‌రోల్ పోషించాడు. తెలుగులో విక్రమార్కుడుగా ఈ చిత్రం విజయం సాధించింది.
2.ఎయిర్‌లిఫ్ట్ : యుద్ధ పరిస్థితుల్లో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను పెద్దసంఖ్యలో తరలించిన యధార్థ సంఘటనల నేపథ్యంలో రూపొందిన సినిమా. 133.35 కోట్ల కలెక్షన్స్ సాధించింది.
3.రుస్తుం : నీరజ్‌పాండే దర్శకత్వంలొ రూపొందిన చిత్రం తొలి వారంలోనే వంద కోట్లు కొల్లగొట్టింది.
4.హౌస్‌ఫుల్2: హౌస్‌ఫుల్ సీక్వెల్‌గా వచ్చిన కామెడీ చిత్రం. 2012లో విడుదలైంది. ఓవరసీస్‌మార్కెట్‌లో సరికొత్త ట్రెండ్ సృష్టించింది. న్యూజిలాండ్‌లో ఈ చిత్రం కలెక్షన్లు ఓ రికార్డు. మొత్తంమీద 106 కోట్లు రాబట్టింది.
5.హాలీడే (ఎ సోల్జియర్ ఈస్ నెవర్ ఆఫ్ డ్యూటి) : అక్షయ్‌కుమార్ సత్తా చాటిన చిత్రం. 112.18 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
6..హౌస్‌ఫుల్ 3 : రెండోభాగం మాదిరిగానే హిట్ కొట్టింది. తొలి పదకొండు రోజుల్లోనే కలెక్షన్ల రికార్డులు సృష్టించింది. మొత్తంమీద 112.18 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
7.జానీ ఎల్‌ఎల్‌బి2 : ప్రస్తుతం వసూళ్లపర్వం మహాజోరుగా సాగుతోంది. తొలివారంలో వందకోట్ల మైలురాయి దాటేసింది. తొలి ఐదురోజుల్లోనే 90 కోట్ల మార్క్ చేరుకుని సంచలనం సృష్టించింది. ఇక షారుక్‌ఖాన్ నటించిన వాటిలో రారుూస్ తాజాచిత్రం. అక్షయ్ నటించిన జానీ ఎల్‌ఎల్‌బి2, రారుూస్ ఈ ఏడాది వందకోట్ల మైలురాయి దాటిన సినిమాల్లో చోటు సంపాదించాయి. గతంలో షారుక్‌ఖాన్ నటించిన సినిమాల్లో చెన్నై ఎక్స్‌ప్రెస్, హేపీ న్యూ ఇయర్, దిల్‌వాలే, జబ్‌తక్‌హైజాన్, రాఒన్, డాన్ 2 సినిమాలు వందకోట్లు వసూళ్లు సాధించాయి. వీటిలో కొన్ని దాదాపు 200 కోట్లకు కొంచెం తక్కువగా వసూళ్లు రాబట్టాయికూడా. మొత్తం మీద అక్షయ్, షారుక్ వందకోట్ల క్లబ్‌లో పోటాపోటీగా ఉండటం విశేషం.