పద్మగా నవ్విస్తాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయిధరమ్‌తేజ్, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘విన్నర్’. ఈ చిత్రం ఈనెల 24న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధు మాట్లాడుతూ- వెనె్నల కిశోర్ ఈ చిత్రంలో పద్మగా ప్రేక్షకుల గుండెలను గెలుచుకుంటాడని, హిలేరియస్ కామెడీతో తనదైన ముద్రతో కడుపుబ్బ నవ్విస్తాడని తెలిపారు. కిశోర్ డైలాగ్ పంచ్‌లు, మాడ్యులేషన్స్ ఈ సినిమాలో హైలెట్‌గా వచ్చాయని, పద్మ పాత్రలో ప్రేక్షకులకు విందు భోజనం లాంటి కామెడీని అందించనున్నారని వారు తెలిపారు. ఇప్పటివరకూ విభిన్నమైన పాత్రల్లో నటించిన వెనె్నల కిశోర్ కోసం దర్శకుడు ఓ అద్భుతమైన కామెడీ పాత్రను రాశారని, ఈ సినిమాలో అతని పాత్ర కొత్తగా వుంటూ, నవ్వుల వర్షం కురిపిస్తుందని తెలిపారు. హార్స్ రేసింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని మహాశివరాత్రి సందర్భంగా విడుదల చేస్తున్నామని వారు తెలిపారు. జగపతిబాబు, ముకేష్ రుషి, అలీ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:్ఛటా కె నాయుడు, సంగీతం:తమన్, కథ:వెలిగొండ శ్రీనివాస్, మాటలు:అబ్బూరి రవి, ఎడిటింగ్:గౌతమ్‌రాజు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:గోపీచంద్ మలినేని.