శే్తబసు బిజీబిజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్యే పలు వివాదాల్లో చిక్కుకున్న శే్వతబసు ప్రసాద్ ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా వుంది. రెండు చిత్రాలకు స్క్రిప్ట్ ఎనలిస్ట్‌గా పనిచేస్తూనే మరోవైపు ఓ డాక్యుమెంటరీ రూపొందిస్తోంది. నాలుగేళ్లుగా మ్యూజిక్‌పై రూపొందించిన ఈ డాక్యుమెంటరీతో సంచలనం రేపడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో పెద్దగా సినిమా అవకాశాల్లేని ఈమె, ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టుకోసం సంగీత దిగ్గజాలైన ఎ.ఆర్.రెహమాన్, గుల్జార్, పండిత్ శివకుమార్, హరిప్రసాద్ చౌరాసియా, బిర్జూ మహారాజ్, పండిత్ బస్‌రాజ్, ఇంతియాజ్ అలీ, ఉస్తాద్ అలీఖాన్, సుబ్రహ్మణ్యం లాంటి మహామహులను ఇంటర్వ్యూలను చేసింది. దీనికోసం చాలానే కష్టపడి ఆల్బమ్ తయారుచేసినట్టు చెబుతోంది. 2002లో ‘మక్డి’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శే్వత, ‘కొత్తబంగారులోకం’ సినిమాతో టాలీవుడ్‌లోకి ప్రవేశించింది. తొలి సినిమాతోనే సంచలన విజయం అందుకున్న ఈమెకు ఆ తరువాత ఆశించిన స్థాయి అవకాశాలు రాలేదు. దాంతో అడపా దడపా సినిమాలు చేస్తున్న సమయంలో అనుకోని చిక్కుల్లో పడింది. ఆ తరువాత బాలీవుడ్‌కి వెళ్లిపోయిన ఈమె ఈ ప్రత్యేకమైన డాక్యుమెంటరీని రూపొందించడం విశేషం.